తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు ఇవే

Updated on: Mar 02, 2025 | 7:25 PM

భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో 2025 సంవత్సరానికి కీలకమైన మార్పులు చేసింది. ట్రైన్‌ టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు ఇకపై కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రైలు టికెట్ల బుకింగ్‌ను రైల్వే శాఖ మరింత సులభతరం చేసింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకతను పెంచడానికి ఈ మార్పులు తీసుకువచ్చినట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.

ఇప్పటివరకు ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే తత్కాల్ టికెట్ బుకింగ్ ఇకపై ఉదయం 11:00 గంటలకు ప్రారంభం కానుంది. రైలు ప్రయాణికులు ఈ కొత్త సమయాన్ని గమనించి, తమ బుకింగ్‌కు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. తత్కాల్ టిక్కెట్ల కోసం ఏసీ, నాన్‌-ఏసీ కోచ్‌లకు ప్రత్యేక కోటాలను నిర్ణయించింది ఐఆర్‌సీటీసీ. కొత్త నిబంధనలతో ప్రయాణికులు కోరుకున్న సీట్లను పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు ఐఆర్‌సీటీసీ డైనమిక్ ధర విధానాన్ని అమలు చేసింది. టికెట్ డిమాండ్, లభ్యతను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండేలా చర్యలు చేపట్టనుంది ఐఆర్‌సీటీసీ. తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. నకిలీ టిక్కెట్ల బుకింగ్‌ను నివారించేందుకు ఈ కొత్త నిబంధన తీసుకువచ్చినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు తత్కాల్ టిక్కెట్ రద్దుపై కఠిన నిబంధనలు ఉండేవి. అయితే, కొత్త మార్పుల ప్రకారం 24 గంటల ముందుగా టికెట్ రద్దు చేసిన ప్రయాణికులకు రీఫండ్‌ లభించేలా ఐఆర్‌సీటీసీ మార్పులు చేసింది. ఈ నియమాలతో టికెట్ల బుకింగ్‌ మరింత సులభతరం కానుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లి గోళ్లు ఇంత ప్రమాదమా..? యువకుడి ప్రాణమే పోయింది.. ఎలాగంటే

వీకెండ్‌లో “ఆత్మల” వేట దెయ్యాల కోటకి టూర్‌ వేస్తారా?

బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు…ఆస్పత్రికి తీసుకెళ్లగా… ఎక్స్‌రేలో

డయాబెటిస్ ఉన్నవారికి అలర్ట్.. ఆ పండ్ల జ్యూస్‌లు అస్సలు తాగొద్దు

డాక్టర్‌ చేయలేనిది.. ఇది చేసేస్తుంది! ఏఐ ఎంట్రీ.. వైద్యరంగంలో గేమ్ ఛేంజరా?