విజయ్ చౌక్ వద్ద కన్నుల పండువగా బీటింగ్ రిట్రీట్ వేడుక.. మైమరిపించిన ఆర్మీ బ్యాండ్
కన్నుల పండువగా గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఘనంగా బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బ్యాండ్ల ప్రదర్శన అందరినీ తెగ ఆకట్టుకున్నాయి.
నాలుగు రోజుల పాటు జరిగే గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చాయి. ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో బీటింగ్ ది రిట్రీట్ వేడుక ఘనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
విజయ్ చౌక్ అన్ని ప్రధాన భవనాలు రంగురంగుల లైటింగ్‌తో అలంకరించారు. దేశ సైనిక సంప్రదాయాల గొప్పతనాన్ని ఈ వేడుకలు ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా త్రివిధ సైన్యాలు, CAPF బ్యాండ్‌లు దేశభక్తి ట్యూన్‌లను ప్రదర్శించాయి. రాష్ట్రపతికి సైన్యం జాతీయ వందనం ఇచ్చిన తర్వాత కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
Published on: Jan 29, 2025 05:23 PM
వైరల్ వీడియోలు