నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్ వీడియో
వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు రోజుల్లో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడు కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి దుమారం వీస్తుంది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాది మినహా దాదాపు మిగతా రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్ బెల్ మోగించింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ చేసింది.
కర్ణాటక, గోవా, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఏపీ, తెలంగాణ, అస్సోం, మేఘాలయ, గోవా, బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా వానలు దంచుకుంటున్నాయి. బెంగళూరులో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణెలో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజులు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం
చిరుత పులిని వెంటపడి తరిమిన కుక్కలు వీడియో
సినిమాలో లెక్కనే వివాహ విందులో మహిళ రచ్చ రంబోలా వీడియో
షార్ట్ సర్క్యూట్ జరగకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే : రిటైర్డ్ ADE తుల్జా రామ్ సింగ్ వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే
