మెట్రో బాదుడు.. టికెట్ చార్జ్ ఎంత పెరిగిందంటే..
హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెరిగాయి. గతంలో ఉన్న కనిష్ఠ టికెట్ ధర రూ. 10 నుంచి రూ.12, గరిష్ఠ టికెట్ ధర రూ. 60 నుంచి రూ. 75కి పెరిగింది. సవరించిన మెట్రో ఛార్జీలను కిలో మీటర్ల వారీగా పెంచుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. పెంచిన ఛార్జీలు మే 17వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఛార్జీల సవరణకు ప్రయాణికులు సహకరించాలని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. మెట్రో రైలు నిర్వహణ భారంగా మారుతోందని, ఛార్జీలు పెంచక తప్పడం లేదని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. గత కొంతకాలంగా ఛార్జీలకు, నిర్వహణ వ్యయానికి మధ్య వ్యత్యాసం భారీగా ఉన్నప్పటికీ కొనసాగించామని, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని తెలిపింది. పెంచిన ఛార్జీలను శనివారం మే 17వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ప్రారంభ ధర రూ.10 ఉండగా దాన్ని రూ.12కు పెంచారు. గతంలో గరిష్ఠ ధర రూ.60 ఉండగా, దాన్ని రూ.75కు పెంచినట్లు యాజమాన్యం తెలిపింది. ఫేర్ ఫిక్సేషన్ ఛార్జీలు లు కిలోమీటర్ల ఆధారంగా పెంచినట్లు అధికారులు తెలిపారు. రెండు కిలోమీటర్ల వరకు రూ.12 ఛార్జీని ఖరారు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అతి చిన్న దేశం.. వాటికన్ కంటె చిన్నది ఏందంటే ??
షుగర్ పేషెంట్స్.. మామిడి తినాలా? వద్దా? అనే డైలమా ఇక వదిలేయండి
పెళ్లి అనుకుంటున్నారా.. స్టంట్స్ షో అనుకుంటున్నారా.. వధూవరుల పై నెటిజెన్స్ ఫైర్

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
