మొన్న చిరుతలు.. ఇప్పుడు పాములు.. తిరుమల భక్తుల్లో కంగారు

మొన్న చిరుతలు.. ఇప్పుడు పాములు.. తిరుమల భక్తుల్లో కంగారు

Phani CH

|

Updated on: Nov 09, 2024 | 12:40 PM

తిరుమలలో వన్యప్రాణులు జనావాసాలకు సమీపంగా వస్తూ తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటి వరకూ చిరుత పులులు భక్తులను హడలెత్తిస్తే.. ఆ తర్వాత టీటీడీ భక్తుల నివాస సముదాయాల వద్ద కొండచిలువలు, నాగుపాములు సంచరిస్తూ భక్తులను, స్ధానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

తాజాగా మంగళవారం తిరుమలలో రెండు పెద్ద పెద్ద పాములను స్నేక్‌ క్యాచర్‌ బంధించి సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. దాంతో భక్తులంతా ఊపిరిపీల్చుకున్నారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లోనూ, భక్తులు స్థానికుల వసతి గృహాల సమీపంలోనూ పాములు కనిపించడం సర్వసాధారణమైనంది. భక్తుల కంట పడ్డ పాములను పట్టి వాటిని తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడం టిటిడి ఫారెస్ట్ విభాగం చేస్తోంది. తాజాగా మంగళవారం తిరుమల జీయన్సీ గార్డెన్ లోని ఓ గదిలోకి ఓ పెద్ద జెర్రిపోతు చొరబడింది. అంత పెద్ద పామును చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌ టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి అయిన భాస్కర్‌నాయుడుకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన ఆ భారీ జెర్రిపోతును పట్టుకుని బంధించాడు. అలాగే రింగ్ రోడ్ లోని డ్రైనేజీ వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న మరో నాలుగు అడుగుల పొడవైన నాగుపామును కూడా భాస్కర్ నాయుడు చాకచక్యంగా పట్టుకున్నాడు. ఇలా ఏక కాలంలో పాములు కన్పించడంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే స్నేక్‌ క్యాచర్‌ వాటిని బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం భాస్కర్‌ నాయుడు రెండు పాములను దట్టమైన అడవిలో వదిలి పెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాణ్యమైన బియ్యం.. కిలో రూ.34 లే

ఈ క్షణం నుంచే హెల్మెట్ మస్ట్.. లేకపోతే జాగ్రత్త !!

పెళ్లికూతురుని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ??

మా కుక్కను దొంగలెత్తుకెళ్లారు !! పోలీసులను ఆశ్రయించిన యజమాని

ఎడారి దేశం‌లో వింత.. మంచు దుప్పటిలో దుబాయ్‌