దానిమ్మ, స్ట్రాబెర్రీతో అద్భుత ఆరోగ్యం..!
దానిమ్మ, స్ట్రాబెర్రీ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లు. రోజువారీ ఆహారంలో ఈ రెండు పండ్లు తీసుకుంటే.. చక్కని ఆరోగ్యాన్ని పొందొచ్చని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మ గింజల్లోని విటమిన్ కే, విటమిన్ సి, ఐరన్, ఖనిజ లవణాలు రక్త హీనతను తగ్గించి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. రోజు దానిమ్మ తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
దానిమ్మ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రక్త ప్రసారాన్ని మెరుగుపరిచి రక్తపోటును తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దానిమ్మతో జీర్ణక్రియ మెరుగవుతుంది. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. తద్వారా చర్మం ఆరోగ్యంగా మృదువుగా ఉంటుంది. తీపి, పులుపు రుచుల కలయికగా ఉండే.. స్ట్రాబెర్రీ .. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులోని విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్ జీవక్రియలను మెరుగుపరిచేలా చేస్తాయి. ఈ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉండటంతో బరువు పెరుగతామనే భయమూ లేదు. స్ట్రాబెర్రీలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ శారీరక బలహీనతను దూరం చేయటంతో బాటు జీర్ణశక్తిని కూడా పెంచుతాయి. అలాగే, రోజూ స్ట్రాబెర్రీ తినే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ పండ్లలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. రక్తపోటు నియంత్రణలోనూ ఈ పండు ఉపయోగపడుతుంది. ఈ పండులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెకనుకు రూ.10 లక్షలు.. ప్రైవేట్ జెట్.. ఈ హీరోయిన్ రేంజే వేరు
కుళ్లిపోయి, దారుణ స్థితిలో హీరోయిన్ డెడ్ బాడీ.. పోలీసులకే సవాల్
బిగ్ బాస్‌లోకి నిఖిల్ మాజీ లవర్ !! సెలక్షన్స్‌తో గూగ్లీ విసురుతున్న బిగ్ బాస్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

