కుళ్లిపోయి, దారుణ స్థితిలో హీరోయిన్ డెడ్ బాడీ.. పోలీసులకే సవాల్
సినీ నటుల జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఉండవు. తెరపై కనిపించే వెలుగుజిలుగుల వెనక ఎన్నో చీకట్లు ఉంటాయి. వారి బాధలు, కన్నీళ్లు బయటి ప్రపంచానికి పెద్దగా కనిపించవు. అవి కనిపించే లోపే వారు తిరిగిరాని లోకాలకు వెళిపోతారు. సిల్క్ స్మిత నుంచి మొదలు పెడితే మొన్నటి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వరకు అందరి జీవితాలూ ఇంతే. ఇప్పుడు ఈ జాబితాలో మరో నటి చేరింది.
అయితే ఆమె మన భారతీయ నటి కాదు. పాకిస్థాన్ నటి. హుమైరా అస్గర్ అలీ. పాకిస్తానీ మోడల్ , నటి… ఉన్నట్టుండి సూసైడ్ చేసుకున్నారు. 32ఏళ్ల వయసున్న ఈ నటి సెలబ్రిటీగా గుర్తింపు సాధించే క్రమంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే ఈ విషయం 9 నెలల తర్వాత బయటపడటంతో ఈ నటి మరణం సంచలనంగా మారింది. హుమైరా అస్గర్ అలీ కొన్నేళ్లుగా కరాచీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. కొన్ని నెలలుగా తానుండే ఫ్లాట్ అద్దె కట్టకపోవటంతో.. ఫ్లాట్ ఓనర్ ఆమె మీద ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఫ్లాట్ కి వెళ్లిన పోలీసులు కాలింగ్ బెల్ కొట్టగా, ఎవరూ తలుపు తియ్యలేదు. చివరకు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా ఆమె శవమై కనిపించింది. అన్నీ డోర్లు లాక్ చేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎముకల గూడుగా కనిపించిన ఆమె.. 9 నెలల క్రితమే చనిపోయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక లాహోర్‌కు చెందిన హుమైరా 2015 ప్రాంతంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె జస్ట్ మ్యారీడ్, ఎహ్సాన్ ఫరామోష్, గురు, చల్ దిల్ మేరే వంటి టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. 2015 యాక్షన్ థ్రిల్లర్ జలైబీ, లవ్ వ్యాక్సిన్ వంటి సినిమాల్లోను నటించింది. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇలా హఠాత్తుగా హుమైరా మరణించడం పాక్ సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్‌లోకి నిఖిల్ మాజీ లవర్ !! సెలక్షన్స్‌తో గూగ్లీ విసురుతున్న బిగ్ బాస్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

