సెకనుకు రూ.10 లక్షలు.. ప్రైవేట్ జెట్.. ఈ హీరోయిన్ రేంజే వేరు
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్. దక్షిణాదిలో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్..సెకనుకు రూ. 10 లక్షలు వసూలు చేసే ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్స్, ఒక్కో సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారల గురించి చెప్కక్కర్లేదు.
దీపిక, కత్రినా, కరీనా, సమంత, రష్మిక.. వీరి పేర్లతోపాటు ఆమె పేరు సైతం సినీరంగంలో మారుమోగుతుంది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో మొత్తం 80 సినిమాల్లో నటించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. లేడీ సూపర్ స్టార్ నయనతార. గతంలో ఓ ప్రకటన కోసం సంతకం చేసిందట నయన్. అందుకు 50 సెకన్లకు రూ.5 కోట్లు వసూలు చేసింది. ఈ యాడ్ తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడతో సహా 4 భాషలలో వచ్చింది. ఈ యాడ్ చేయడానికి కేవలం రెండే రెండు రోజులు పట్టిందట. 2018 సంవత్సరంలో ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక దక్షిణాది నటి నయనతార. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఇంగ్లీష్ లో ఎంఏ చేసిన నయన్.. CA కావాలనుకుందట. కానీ అనుహ్యంగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అయితే ఆమె కెరీర్ ముగిసిందని అనుకున్న సమయంలోనే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు ఉన్న హీరోయిన్లలో నయన్ ఒకరు. ప్రతి సినిమాకు దాదాపు రూ. 10 కోట్లకు పైనే వసూలు చేస్తుంది. నయనతార రూ. 200 కోట్ల ఆస్తులకు యజమానిగా చెబుతారు. ఆమెకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది, దీని ధర దాదాపు రూ. 50 కోట్లు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుళ్లిపోయి, దారుణ స్థితిలో హీరోయిన్ డెడ్ బాడీ.. పోలీసులకే సవాల్
బిగ్ బాస్‌లోకి నిఖిల్ మాజీ లవర్ !! సెలక్షన్స్‌తో గూగ్లీ విసురుతున్న బిగ్ బాస్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

