Weather: అన్నదాతలకు గుడ్‌ న్యూస్‌.! ఈ ఏడది మెరుగైన వర్షాలు పడతాయంటున్న నిపుణులు.

| Edited By: Ram Naramaneni

Feb 22, 2024 | 8:15 PM

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది వాతావరణశాఖ. ఈ ఏడాది రైతన్నకు వాతావరణం అనుకూలిస్తుందని తెలిపింది. వ్యవసాయరంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, జూన్‌లో రానున్న నైరుతి రుతుపవనాలు రైతులఇంట ఆనందం కురిపిస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది జూన్ లోనే వర్షాలు ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ వరకు మెరుగ్గా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది వాతావరణశాఖ. ఈ ఏడాది రైతన్నకు వాతావరణం అనుకూలిస్తుందని తెలిపింది. వ్యవసాయరంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, జూన్‌లో రానున్న నైరుతి రుతుపవనాలు రైతులఇంట ఆనందం కురిపిస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది జూన్ లోనే వర్షాలు ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ వరకు మెరుగ్గా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో గత ఏడాది నుంచి కొనసాగుతున్న ఎల్ నినో బలహీనపడి జూన్ నాటికి పూర్తిస్థాయిలో బలహీనపడుతుందని… నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత లానినా ఏర్పడుతుందని దేశీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని వాతావరణ సంస్థలు చేపట్టిన సర్వేలో తెలిసింది. ఈ ఎల్ నినో ఇలాగే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పాటు, వర్షపాతం తక్కువగా నమోదు కావడం, కొన్నిచోట్ల అనుకోని విపత్తులు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారత ఉపఖండంపై ఈ ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా ఏప్రిల్ నుండి ఎల్ నినో బలహీనపడి ఆగస్టు నాటికి లానినా బలపడుతుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఈ విషయాన్ని తెలిపారు. ఎల్ నినో తీవ్రత నేపథ్యంలో గత ఏడాది సమ్మర్ కంటే ఈ ఇయర్ సమ్మర్ లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. మొత్తానికి నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి వచ్చి మంచి వర్షాన్ని ఇచ్చినప్పటికీ వచ్చే వేసవి మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని దానితోపాటు తుఫాన్ల తీవ్రత కుంభవృష్టి వర్షాలకు ఛాన్స్ ఎక్కువగా ఉందని జాతీయ అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on