Software engineer: దారుణం..సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్.. స్నేహితులతో బయటకు వెళ్లిన మహిళను ఎత్తుకెళ్లి..
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా దిశ సంఘటనలు దేశవ్యాప్తంగా రిపీట్ అవుతూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. పసిమొగ్గలను సైతం తమ పైశాచికత్వంతో తుంచేస్తున్నారు.
తాజాగా ఝార్ఖండ్‌లో మరో యువతి కామాంధులకు బలైపోయింది. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సామూహిక అత్యాచారానికి గురైంది. అక్టోబరు 20న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రముఖ ఐటీ సంస్థ తరఫున ఆ యువతి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అక్టోబరు 20న సాయంత్రం తన స్నేహితుడితో కలిసి స్కూటీపై చాయీబాసా శివారులోని విమానాశ్రయ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి పదిమంది యువకులు వచ్చారు. ఆమె స్నేహితుణ్ని చితకబాది, దుండగులు యువతిని లాక్కెళ్లిపోయారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి పది మంది దుండగులు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతి అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. ఆమె పర్సులోని నగదు, మొబైల్ ఫోను తీసుకొని పరారయ్యారు. అపస్మారక స్థితినుంచి తేరుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. అనంతరం కటుంబ సభ్యులతో కలిసి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఈ ఘటనలో 12 మంది అనుమానితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

