ఈ డ్రైవర్ స్కిల్స్ కు దండం పెట్టాల్సిందే.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..
డ్రైవింగ్ చేయడం సాధారణ విషయమేమీ కాదు. రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్నప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం అంటే..

డ్రైవింగ్ చేయడం సాధారణ విషయమేమీ కాదు. రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్నప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం అంటే సాహసయాత్ర చేయడమే అని చెప్పొచ్చు. మలుపులు, ఘాట్ రోడ్లలో అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. పర్వతాల మీద డ్రైవింగ్ చేయడం సాధారణ డ్రైవర్ కు చాలా కష్టంతో కూడుకున్న విషయం ఇందుకు చాలా అనుభవం కావాలి. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా భారీ మూల్యానికి కారణమవుతుంది. కారు డ్రైవింగ్ చేయడాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో. కానీ అధ్వాన్నమైన రోడ్లపై, ఘాట్ రోడ్లపై డ్రైవింగ్ చేయడం అనేది అందరికీ సాధ్యమయ్యే వ్యవహారం కాదు. డ్రైవర్లు తమ వాహనాల బ్యాలెన్సింగ్ ను కోల్పోతుంటారు. దీని వల్ల చాలాసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇది అందరి విషయంలో కాదని గుర్తుంచుకోవాలి. కొందరు మాత్రం కొండ ప్రాంతాల్లోనూ చాలా జాగ్రత్తగా వాహనాలు నడుపుతారు. ఏ మాత్రం భయం లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వెహికిల్స్ ను మూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ వ్యక్తి.. తాను కారులో వెళ్తున్న సమయంలో యూ టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆ దారిలో యూటర్న్ తీసుకునే అవకాశం లేకుండా ఉంటుంది. అయినా అతను ఏ మాత్రం భయపడకుండా ఎంతో చాకచక్యంగా కారును మలుపు తిప్పుతాడు. ఈ సమయంలో కారు వెనుక టైరు పూర్తిగా లోయ ప్రాంతంలో ఉండటం వెన్నులో వణుకు పుట్టించింది. ఏ క్షణంలోనైనా వాహనం పడిపోతుందని భావించినా.. డ్రైవర్ మాత్రం ఎలాంటి ప్రమాదానికి అవకాశం ఇవ్వకుండా ఇరుకైన దారిలో నుంచి వాహనాన్ని బయటకు తీశాడు.




Unbelievable! Master driver! pic.twitter.com/1X1BTgkMuK
— The Figen (@TheFigen_) October 22, 2022
ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. వార్త రాసే వరకు వీడియోకు రెండు కోట్లకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి డ్రైవర్ తన జీవితంలో ఇప్పటి వరకు చూడలేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..