Puppies skipping: యజమానితో కలిసి స్కిప్పింగ్ ఆడుతున్న కుక్కపిల్లలు.. తెగ ఎంజాయ్ చేస్తున్న నెటిజన్లు..
సాధారణంగా పెంపుడు కుక్కలు తమ యజమానులతో ఎంతో విశ్వాసంగా ఉంటాయి. వారి కుటుంబంలో సభ్యుల్లా మారిపోతాయి. అంతేకాదు తమ యజమాని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాయి. అంతేకాదు వాటికి చిన్నప్పటినుంచి ఏది నేర్పించినా వెంటనే నేర్చుకుంటాయి.
తాజాగా ఓ నాలుగు కుక్కపిల్లలు తన యజమానితో కలిసి ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి తమ యజమాని వ్యాయామంలో భాగంగా ఉదయాన్నే స్కిప్పింగ్ ఆడుతున్నాడు. అక్కడికి చేరిన మూడు కుక్కపిల్లలు అతనితో కలిసి స్కిప్పింగ్ ఆడుతున్నాయి. అతను తాడు వాటి మీదుగా వేస్తుంటే ఎంతో చాకచక్యంగా అవి ఆ తాడుమీదనుంచి జంప్ చేస్తున్నాయి. ఇదంతా గమనిస్తూ అక్కడే ఉన్న మరో కుక్కపిల్ల నేనూ ఆడతాను.. అంటూ పరుగెత్తుకుని వాళ్లదగ్గరకి చేరింది. అదికూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి స్కిప్పింగ్ ఆడింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటుంది. ఎంతో క్యూట్‌గా ఉన్న ఆ కుక్కపిల్లలు అలా ఎగురుతుంటే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.