Small Snake: చిన్న పామే కదా అని చేతిలోకి తీసుకుంది.. అంతే.. ఒక్కసారిగా తల్లిదండ్రులు కూడా షాక్..
చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. అంటే ఒక్కోసారి సమస్య చిన్నగా కనిపించినా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు.. అందుకే అప్రమత్తంగా ఉండాలని పెద్దలు చెప్పిన ఆ మాటలోని అర్థం. అందుకే పాము చిన్నదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇక్క ఓ 11 ఏళ్ల బాలిక ఓ చిన్న పామును చేత్తో పట్టుకుంది. అది అటూ ఇటూ కదులుతుంటే ఎంజాయ్ చేసింది. అయితే అది అత్యంత విషపూరితమైనదని తెలుసుకొని ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఓ బాలిక తన గ్రాండ్ పేరెంట్స్‌తో బయటకు వెళ్లింది. ఈ సందర్భంగా తనకు ఓ గోధుమ రంగులలో ఉండే ఒక చిన్న పాము కనిపించింది. వెంటనే ఆమె.. పామును తన చేతుల్లోకి తీసుకుంది. ఆ పాము తన అరచేతిలో అటు ఇటూ కదులుతూ ఉంది. ఈ క్రమంలో పామును వదిలేయమని తన కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఇంతలో ఒక సభ్యుడు ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ స్నేక్ క్యాచర్ స్పందించాడు. ఆ పాము అత్యంత విషపూరితమైనదని తెలిపాడు. పాము విషయంలో చిన్నారి ఎంతో అదృష్టవంతురాలని, పొరపాటును ఆ పాము కాటు వేసి ఉంటే ఆమె స్పాట్‌లో చనిపోయి ఉండేదని తెలిపాడు. దీంతో, చిన్నారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా, ఈ పాముల కారణంగానే ఆస్ట్రేలియాలో అధిక మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. చిన్నారి ఎంతో లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

