Hand pump on Road: అట్లుంటది మనతోని..! ఎలా పోతే మాకేంటి.? రోడ్డు వేశామా లేదా.? అవాక్కవుతున్న ప్రజలు..
గ్రామంలో గానీ, నగర వీధుల్లో గానీ రోడ్డు వేసేటప్పడు అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. రోడ్డు మధ్యలో చెట్లు, స్తంభాలు వంటివి లేకుండా జాగ్రత్త పడతారు. అంతే కాకుండా రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న వాటిని తొలగిస్తుంటారు.
గ్రామంలో గానీ, నగర వీధుల్లో గానీ రోడ్డు వేసేటప్పడు అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. రోడ్డు మధ్యలో చెట్లు, స్తంభాలు వంటివి లేకుండా జాగ్రత్త పడతారు. అంతే కాకుండా రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న వాటిని తొలగిస్తుంటారు.కానీ ఓ చోట మాత్రం అధికారులు అవేమీ పట్టించుకోలేదు. వచ్చామా, రోడ్డు వేశామా, వెళ్లి పోయామా అనే ధరోణితో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇది చూసిన గ్రామస్థులు, నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ రోడ్డుపై ఎలా రాకపోకలు సాగించాలని ప్రశ్నిస్తున్నారు. ఏపీ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ కొత్త కాలనీలో వేసిన అంతర్గత రహదారి పరిస్థితి ఇది. గ్రామంలో ఇది గతంలో మట్టిబాటగా ఉండేది. అక్కడే చేతిపంపు ఉండేది. అవసరాలు తీర్చుకునేందుకు గ్రామస్థులు దీనిని ఉపయోగించుకునేవారు. ఇటీవల ఇక్కడ సీసీ రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయి. దాంతో చేతిపంపు రోడ్డు మధ్యలో వస్తుందని తెలిసినా అలాగే సీసీ పోసి, చదును చేశారు. దారి మధ్యలో చేతిపంపు వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీ రోడ్డు వేసేటప్పుడే చేతిపంపు తొలగించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి గురించి కొత్తగా తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకు అమెరికాకు.. క్షణికావేశంలో..
వాహనదారులపట్ల ట్రాఫిక్ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం
రైతుల ఐడియాకు బెంబేలెత్తిపోయిన దొంగలు
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల విజయ కేతనం
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!

