Coffee Side effects: మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!

Coffee Side effects: మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!

Anil kumar poka

|

Updated on: Sep 18, 2024 | 12:38 PM

ఉదయాన్నే వేడి వేడి కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అలాగే ఆఫీసులో వర్క్‌ చేస్తున్నప్పుడు కాస్త బద్దకంగా అనిపించినా వెంటనే ఓ కాఫీ తాగాలనిపిస్తుంది. తద్వారా వెంటనే బద్దకం పోయి చురుకుగా మళ్లీ పనిచేసుకోగలుగుతారు. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయం అయిపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్‌ మహాత్యమే. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది.

ఉదయాన్నే వేడి వేడి కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అలాగే ఆఫీసులో వర్క్‌ చేస్తున్నప్పుడు కాస్త బద్దకంగా అనిపించినా వెంటనే ఓ కాఫీ తాగాలనిపిస్తుంది. తద్వారా వెంటనే బద్దకం పోయి చురుకుగా మళ్లీ పనిచేసుకోగలుగుతారు. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయం అయిపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్‌ మహాత్యమే. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది. అయితే కాఫీతో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. నిద్రలేమితో బాధపడేవారు సాయంత్రం పూట కాఫీ తాగకపోవటమే మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో ఉప్పు, నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోయి ఒంట్లో నీటిశాతం తగ్గే ప్రమాదముంది. ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారూ కాఫీ తాగడం తగ్గిస్తే మంచిదంటున్నారు. కెఫీన్‌ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది ఛాతీలో మంట, పులితేన్పుల వంటి సమస్యలకు దారితీయొచ్చు. కెఫీన్‌ రక్తపోటు పెరిగేలా చేస్తుంది కాబట్టి హైబీపీ బాధితులు కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మనం తిన్న ఆహారంలోని క్యాల్షియంను శరీరం గ్రహించుకునే ప్రక్రియకు కెఫీన్‌ అడ్డు తగులుతుంది. కాఫీ తాగిన గంటలోపు రక్తంలో కెఫీన్‌ స్థాయులు తారస్థాయికి చేరుకుంటాయి. దీని ప్రభావం 4 నుంచి 6 గంటల వరకూ ఉంటుందంటున్నారు నిపుణులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.