Adivi Sesh: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడవి శేషు.. వీడియో

Adivi Sesh: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడవి శేషు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 23, 2021 | 8:52 AM

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజుల క్రితం అడవి శేషుకు డెంగ్యూ సోకినట్లుగా ఇండస్ట్రీలో ఓ వార్త వ్యాపించింది. అయితే తాజాగా శేషు రక్తంలో ఉన్న ప్లేట్‏లెట్స్ ఆకస్మాత్తుగా పడిపోవడంతో..

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజుల క్రితం అడవి శేషుకు డెంగ్యూ సోకినట్లుగా ఇండస్ట్రీలో ఓ వార్త వ్యాపించింది. అయితే తాజాగా శేషు రక్తంలో ఉన్న ప్లేట్‏లెట్స్ ఆకస్మాత్తుగా పడిపోవడంతో.. ఆయన్ని హైదరాబాద్‏లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లుగా సమాచారం. దీంతో శేషుకు ప్రత్యేకంగా చికిత్స చేస్తున్నారట వైద్యులు. అయితే ఇప్పటివరకు ఈ యంగ్ హీరో ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు గానీ.. సన్నిహితులు కానీ స్పందించలేదు. త్వరలోనే ఆయన ఆరోగ్యంకు సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబసభ్యులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక యంగ్ హీరో ఇలా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఈ కోతికి తిక్కుంది.. దానికో లెక్కా ఉంది.. నాతోనే ఆటలా.. ఎగిరెగిరి తన్నుతున్న కోతి.. నెట్టింట్లో వీడియో వైరల్‌

Tunnel Prostitution: సొరంగంలో డర్టీ పిక్చర్.. పోలీసుల ఫ్యూజులు ఔట్.. లైవ్ వీడియో