Waltair Veerayya: చిరు సాంగ్ పై యండమూరి అసహనం.. వ్రాసిన వారు ఎవరో కానీ అంటూ.. వీడియో.
ఓ పక్క మెగాస్టార చిరు వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వేళ.. వింటున్న వారికి గూస్ బంప్స్ తెప్పిస్తున్న వేళ.. ఇదంతా పిచ్చి రాతంటూ..
ఓ పక్క మెగాస్టార చిరు వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వేళ.. వింటున్న వారికి గూస్ బంప్స్ తెప్పిస్తున్న వేళ.. ఇదంతా పిచ్చి రాతంటూ.. కొట్టిపారేశారు నావల్ రైటరల్ యండమూరి వీరేంద్రనాథ్. కొట్టిపారేయడమే కాదు.. ఈ సాంగ్ రాసిన లిరిసిస్టు చంద్రబోసు పై తీవ్ర విమర్శలు చేశారు. పాటల్లో సాహిత్యం మసకబారిపోతోందంటూ అసహనం వ్యక్తం చేశారు.ఎస్ ! గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న యండమూరి.. తాజాగా ఓ సినిమా తీసే పనిలో ఉన్నారు. ఇక ఆ క్రమంలోనే తాజాగా రిలీజై మెగా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లిరిక్స్ పై కామెంట్స్ చేశారు. ఆయన ఫేస్ బుక్ వేదికగా .. ఓ భారీ పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్ ఏంటి.. ఆపోస్టులో యండమూరి రాసిన అక్షరాలు ఏంటో.. మీరూ చూసేయండి!”తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడే వీడే … తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే !.. ఇవి వాల్తేరు వీరయ్య సినిమా పాటలోని పదాలు !.. వ్రాసిన వారు ఎవరో కానీ అసలు అతడెందుకు వ్రాశాడు అతనికి ఏ సంప్రదాయం తెలుసు ? ఏ పురాణకధలు చదివాడు ? తిమిరము అంటే అర్ధం తెలుసా నీకు?.. త్రినేత్రుడు అనగా శివమహాదేవుడు ! ఆయన తిమిరనేత్రము అనగా చీకటి కన్నుగా కలిగినవాడు ,లేదా రోగమున్న కన్నుకలవాడు ! ఏ అర్ధం తీసుకున్నా అది శివదూషణే ! .. ఇక ఏ తుఫాను అంచున వశిష్టమహర్షి తపస్సు చేశారో చెప్పు నాయనా ? .. తెలుసా తెలియదా ? ఏమిటీ పిచ్చిరాతలు ? తెలుగు సినీ కవిత్వం వేటూరి మరణంతో మసకబారిన దీపమయ్యింది సిరివెన్నెల మరణం ఆ కాస్త దీపాన్ని ఆర్పేసింది !” అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

