వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ముంబై వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. మొత్తం 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్టప్ లు పాలు పంచుకోనున్నాయి. అలాగే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా భారత సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ తారలు, వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కాగా వేవ్స్ సమ్మిట్ లో అల్లు అర్జున్ ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఇదే సదస్సు వేదికగా టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ బన్నీని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ ఐకాన్ స్టార్.
నాకు 10వ సినిమాలో యాక్సిడెంట్ జరిగింది.. ఆరునెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దీంతో చాలా భయపడ్డాను. . 18వ సినిమా ఫ్లాప్ కావడంతో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాను. ఆ ఫ్లాప్ సినిమా నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. కానీ కసితో పనిచేశాను. ఈ క్రమంలోనే నేను 20వ సినిమాకు జాతీయ అవార్డును సాధించాను. ఎవరైనా మంచి కోసమే సలహాలు ఇస్తారు. ఎంతోమంది పెద్దలు నాకు సలహాలు ఇస్తారు. నా విషయానికి వస్తే షూటింగ్‌లో లేనప్పుడు కూడా నాకు ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే ఇష్టం. ప్రతి సినిమా నాకు ముఖ్యమే. అభిమానులను దృష్టిలో పెట్టుకునే పాత్రల ఎంపిక చేసుకుంటాను. అలాగే విలక్షణ నటన కోరుకుంటాను. నాకు దేశవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు.’ అని చెప్పుకొచ్చారు.
కాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. బన్నీ కెరీర్ లో ఇది 18వ సినిమా. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..