తొమ్మిదేళ్ల కలను నిజం చేసుకునేందుకు.. పెళ్లి వాయిదా వేసుకున్న స్టార్ హీరో
అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కేవాడు కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్. హీరోయిన్ సాయి ధన్సికతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టేవాడు. అయితే ఈ శుభకార్యానికి మరి కొంత సమయం పట్టేలా ఉందని కోలీవుడ్ న్యూస్. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్ లో హీరో విశాల్ హీరోయిన్ సాయి ధన్సికను తన ప్రేయసిగా పరిచయం చేశాడు.
ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నామంటూ వెడ్డింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. దీంతో విశాల్ అభిమానులు కూడా తెగ సంతోష పడ్డారు. అయితే ఇప్పుడు ఈ పెళ్లి వాయిదా పడనుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దీనిపై విశాల్ స్పందించాడు. సాయి ధన్సికతో తన పెళ్లి నడిగరం సంఘం భవంతిలోనే జరుగుతుందని.. అది ఎప్పుడు పూర్తయితే అప్పుడే తమ వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటామన్నాడు. నడిగర్ సంఘం భవనం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూశానని.. ఇప్పుడు ఇంకో రెండు నెలలు ఆగలేనా? అంటూ ప్రశ్నించాడు.నడిగర్ సంఘంలో జరగబోయే మొదటి పెళ్లి నాదే. అందులో డౌటేమీ లేదు. ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నాను. ప్రస్తుతం ఆ భవంతి మూడో అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నారు అంటూ విశాల్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. దక్షిణ భారత కళాకారుల సంఘం అయిన నడిగర్ సంఘ భవన నిర్మాణం ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. మొదట 2017లో ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ఈ భవన నిర్మాణం పూర్తవ్వడం లేదు. పదేపదే జాప్యాలను ఎదుర్కొంది. అయితే దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు విశాల్. మొత్తానికి ఈ కల అతి త్వరలోనే నెరవేరనుంది. ఈ క్రమంలోనే తన పెళ్లి ఇందలో చేసుకునేందుకే తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చాడు ఈ స్టార్ హీరో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మానసికంగా కుంగిపోయా’ రష్మీ షాకింగ్ ట్వీట్ !
ఎలా ఉండేది.. ఎలా అయింది! వైరలయ్యేందుకు కాదుగా ఈ డ్రామాలు?
బైకుపై కూర్చున్న వ్యక్తి.. సడన్‌గా వచ్చిన పాము.. ఆ తర్వాత..?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

