బొంగులో చికెన్ కాదు.. వెదురు బొంగుల కూర తింటే వదిలిపెట్టరు
అరకు లోయ, ఇతర గిరిజన ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన బొంగులో చికెన్ గురించి అందరికీ తెలుసు. ఇది మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పరిచయమున్న వంటకం. బాగా మసాలా దట్టించి మ్యారినేట్ చేసిన చికెన్ ను వెదురు ముక్కలో కూర్చి దానికి మూతికి అడ్డంగా ఆకులు కట్టి కట్టెల్లో పెట్టి ఆ వెదురు బొంగుని కాల్చుతారు. వెదురులోని సారం చికెన్ కు పట్టడంతో అది రుచికరంగా తయారవుతుంది.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రజలు అత్యంత ఇష్టంగా తినే మరో కూర వెదురు కొమ్ము కూర. ఈ వెదురు కొమ్ము కూర తయారీ కోసం ముందుగా గిరిజనులు అడవిలోకి వెళ్లి లేత వెదురు పిలకలను కోసుకు వస్తారు. వాటిపై పొరను నీటిలో శుభ్రం చేసి, లేత కొమ్ములను తురిమి ఉడికించి పప్పులో వేస్తారు. ఇలా కేవలం పప్పు మాత్రమే కాకుండా వేపుడుగాను వండుతారు. నాన్ వెజ్ వంటల్లో నూ ఈ తురుము వేసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుందని జ్యోతి అనే మహిళ చెబుతున్నారు. కేవలం రుచికోసం మాత్రమే కాకుండా మహిళలకు ఇలా వెదురు కొమ్ముల కూరను ఆహారంగా తీసుకోవటం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆమె చెబుతున్నారు. ఈ వెదురు బొంగుల కూర ఎలా వండుతారు. దాని ఆరోగ్య ప్రయోజనాల గురించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఈ కూరగాయలోనే
Sweet Potato: చిలకడ దుంప.. చేసే మేలు ఎంతో
పాములతో ఆటలా? నదిలోకి దూకి పాముల వెలికితీత.. ఎక్కడంటే..
సన్నటి నడుము కోసం పక్కటెముకలు తొలగింపు.. డాక్టర్లు వారిస్తున్నా మొండిగా ముందుకే
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

