జాన్వీ బిగ్ స్కెచ్.. చరణ్ సినిమాతో టార్గెట్ అఛీవ్డ్
జాన్వీ కపూర్! ఇప్పుడు జెస్ట్ బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు. పాన్ ఇండియా స్టార్. అందులోనూ సౌత్ ఇండియాలోనూ ఇప్పుడు ఈ బ్యూటీకి మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూనే తన రెమ్యునరేషన్‌ను అమాంతంగా పెంచుకుంటూ పోతోందట ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే పెద్దికి బిగ్ స్కెచ్ వేసిందటన ఈ బ్యూటీ. ఎస్ ! రామ్ చరణ్ సినిమా కోసం ఏకంగా భారీ పారితోషకానికే గురిపెట్టిందట.
ఇక ఈ న్యూస్ కారణంగానే ఇప్పుడు ఉన్నట్టుంది నెట్టింట వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. దేవర సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ . ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎంతో అందంగా నటించింది. దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ 5 కోట్ల పారితోషికం తీసుకుందని సమాచారం. ఇప్పుడు పెద్ది సినిమా కోసం మరో కోటి రూపాయలు పెంచిందని బీటౌన్ న్యూస్. ఎస్ ! రామ్ చరణ్ సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా ఆరు కోట్లు తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు తన టీంకు కొన్ని ఫెసిలిటీస్ కూడా అడిగిందట ఈ బ్యూటీ. ఇక పేరుకు తగ్గట్టుగానే ‘పెద్ది’ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు రీసెంట్‌గా రామ్ చరణ్ డ్రాప్ చేసిన తన మస్కులర్ పిక్ సోషల్ మీడియాలో అగ్గి పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ 6 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఉన్నట్టుండి వైరల్ లోకి వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తొమ్మిదేళ్ల కలను నిజం చేసుకునేందుకు.. పెళ్లి వాయిదా వేసుకున్న స్టార్ హీరో
‘మానసికంగా కుంగిపోయా’ రష్మీ షాకింగ్ ట్వీట్ !
ఎలా ఉండేది.. ఎలా అయింది! వైరలయ్యేందుకు కాదుగా ఈ డ్రామాలు?
బైకుపై కూర్చున్న వ్యక్తి.. సడన్‌గా వచ్చిన పాము.. ఆ తర్వాత..?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

