బీజేపీలోకి చిరు ?? కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే..

Updated on: Jan 20, 2025 | 7:35 PM

ఇటీవల భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో సినీ నటుడు చిరంజీవి తరచుగా కనిపిస్తున్నారు దీంతో ఆయన పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ప్రధాని మోడీ పక్కన మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

దీంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిరంజీవిని మెల్లగా బిజెపిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక దీనిపై స్పందించారు కిషన్ రెడ్డి.. సినిమా రంగంలో అందరూ చిరంజీవిని అగ్ర నటుడిగా చూస్తున్నారని అందుకే ఆయనను తరచుగా వివిధ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. చాలామంది సినీ ప్రముఖులకు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయని ఎన్నో కార్యక్రమాల్లో సినీ నటీనటులు పాల్గొన్న సందర్భాలను ఆయన గుర్తు చేశారు. ఎంతోమంది నటులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా బిజెపి నుంచి పోటీ చేశారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి బిజెపిలోకి వస్తారా అన్న ప్రశ్నకు మాత్రం కిషన్ రెడ్డి సమాధానం దాటవేశారు. తెలుగు సినీ నటుల్లో ఎంతోమంది ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారని కిషన్ రెడ్డి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా అగ్ర నటుడు కాబట్టి పలు కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇతర నటులు ఎవరైనా కార్యక్రమాలకు వస్తామని చెబితే తప్పకుండా వారిని కూడా ఆహ్వానిస్తామని… అదేవిధంగా సెలబ్రిటీలను కలిసే సాంప్రదాయాన్ని బిజెపి ఎల్లప్పుడు పాటిస్తుందని స్పష్టం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీన స్థితిలో పావలా శ్యామల.. పూరి తనయుడి ఆర్థిక సాయం..

సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా..

చలికాలంలో త్వరగా అలిసిపోతున్నారా? అయితే మీలో ఈ లోపం ఉన్నట్టే!

కోట్లున్న స్టార్ హీరో.. రూపాయి ఆశించకుండా ఆటోవాలా సాయం

సైఫ్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు..