Ravi Teja: మాస్ మహరాజ్ మారాల్సిన సమయం వచ్చినట్టేనా ??
కొంతమంది స్టార్ హీరోల సినిమా రిలీజ్‌లకు గతంలో ఉండే సందడి ఇప్పుడు కనిపించడం లేదు. రవితేజ, వరుణ్ తేజ్ వంటి నటుల సినిమాలకు ఓపెనింగ్స్ తగ్గుతున్నాయి. కేవలం రొటీన్ కమర్షియల్ కంటెంట్ కాకుండా, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఎగ్జయిటింగ్ కంటెంట్, బలమైన ప్రమోషన్లు అవశ్యకం. ఇది నిర్మాతలు, నటులు గ్రహించాల్సిన సమయం.
సినిమా రిలీజ్ అంటే ఎలా ఉండాలి? పార్కింగ్ నుంచే ఆ కళ కనిపించాలి. థియేటర్ల ముందే కాదు, బైకులు, కార్ల పార్కింగుల ముందు.. కూడా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాలి. ఫ్యాన్స్ జేజేలతో ప్రాంగణాలన్నీ మారుమోగాలి. కానీ, కొందరి సినిమాలు రిలీజు అవుతుంటే ఏమాత్రం సందడి కనిపించడం లేదు. ఎందుకలా? మాస్ మహరాజ్ సినిమా రిలీజ్ అంటే థియేటర్లలో మోత మోగాలని ఫిక్సవుతారు జనాలు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఆ వైబ్‌ని మిస్ అవుతున్నారు ఆడియన్స్. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే కంటెంట్‌ని రవితేజ సెలక్ట్ చేసుకోవడం లేదా? రొడ్డకొట్టుడు మూస కమర్షియల్ సినిమాలతో వాళ్లు విసుగెత్తిపోయారా? రీజన్ ఏదైనా మార్పు రావాల్సిన సమయం ఇది అనే మాట మాత్రం వినిపిస్తోంది. వరుణ్ తేజ్ విషయంలోనూ ఇదే మాట రిపీట్ అవుతోంది. అప్పుడెప్పుడో ఫిదా తర్వాత వరుణ్ నుంచి ఆ రేంజ్ సబ్జెక్టును కోరుకుంటున్నారు జనాలు. కానీ, బాక్సాఫీస్ దగ్గర గలగలలు తెచ్చే కాన్సెప్టులు మాత్రం ఆయన దాకా చేరడం లేదెందుకో మరి.. ఇటు అల్లరి నరేష్ రీసెంట్ మూవీకి థియేటర్లలో ఓపెనింగ్స్ లేవంటే అతిశయోక్తి కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ అరచేతుల్లోకి వచ్చేసిన ఈ టైమ్‌లో జనాలను థియేటర్లదాకా తీసుకురావాలంటే కచ్చితంగా ఎగ్జయిటింగ్‌గా ఏదో ఉండాలి. దాన్ని మిస్ కానంత వరకు, ప్రమోషన్ల టైమ్‌లోనే జనాల్లో కిక్ తీసుకురాగలిగినంత వరకు ఢోకా లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే నిర్మాతల డబ్బు మాత్రమే కాదు, సర్వం వృథా అనే విషయాన్ని గ్రహించాలనే సలహాలు చాలానే వినిపిస్తున్నాయి అనుభవజ్ఞుల నుంచి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్
ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం
ఫోన్‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు
తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

