TOP9 ET: ప్రభాస్‌ వరల్డ్ వార్ లవ్ స్టోరీ.. కొడితే దిమ్మతిరిగి పోద్ది..! ఇది ఫిక్స్..! వీడియో అదుర్స్..

TOP9 ET: ప్రభాస్‌ వరల్డ్ వార్ లవ్ స్టోరీ.. కొడితే దిమ్మతిరిగి పోద్ది..! ఇది ఫిక్స్..! వీడియో అదుర్స్..

Anil kumar poka

|

Updated on: May 28, 2023 | 5:42 PM

ఎప్పటి కప్పుడు న్యూ లుక్స్‌తో.. ట్రెండ్ సెట్ చేసే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో సారి తన న్యూ లుక్స్‌ తో నెట్టింట హీట్ పెంచేశారు. ఓ యాడ్ షూట్ సందర్భంగా.. అన్నపూర్ణ సెట్‌లో సందడి చేసిన తారక్ .. క్యాజువల్ గా కొన్ని ఫోటోలు దిగడం అవి బయటికి రావడంతో.. ఇప్పుడవి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

01.NTR
ఎప్పటి కప్పుడు న్యూ లుక్స్‌తో.. ట్రెండ్ సెట్ చేసే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో సారి తన న్యూ లుక్స్‌ తో నెట్టింట హీట్ పెంచేశారు. ఓ యాడ్ షూట్ సందర్భంగా.. అన్నపూర్ణ సెట్‌లో సందడి చేసిన తారక్ .. క్యాజువల్ గా కొన్ని ఫోటోలు దిగడం అవి బయటికి రావడంతో.. ఇప్పుడవి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. తారక్‌ లుక్‌ కు అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తున్నాయి.

02.Salaar
ఆదిపురుష్ సినిమాతో పాటు ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్‌. జూన్‌ 16న రిలీజ్ అవుతున్న ఆదిపురుష్ సినిమాతో పాటు ప్రభాస్ నెక్ట్స్ మూవీ సలార్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్. ఇక ఇదే ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కు విపరీతంగా కిక్కిస్తోంది.

03. Simbu
శింబు హీరోగా కమల్ హాసన్‌ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్స్ బ్యానర్‌లో ఓ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ రోల్‌కు ముందు దీపిక పదుకొన్‌ను అప్రోచ్ అయ్యారు మేకర్స్. కానీ ఆమె భారీ రెమ్యూపరేషన్ డిమాండ్ చేయండంతో.. తాజాగా దిశా పాట్నీ ని ఫైనలైజ్ చేశారట. ఇప్పుడిదే న్యూస్ కోలీవుడ్ క్రేజీగా బజ్ అవుతోంది

04. Chiranjeevi
సీనియర్ దర్శకుడు కే వాసు మృతికి సంతాపం తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ‘వాసుగారు ఇక లేరు అనే వార్త ఎంతో బాధించింది. నా కెరీర్ తొలి రోజుల్లో చేసిన ప్రాణం ఖరీదు, తోడు దొంగలు, అల్లుళ్లు వస్తున్నారు, కోతల రాయుడు చిత్రాలకి ఆయన దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం’ అంటూ ట్వీట్ చేశారు చిరు.

05. The Kerala Story
ది కేరళ స్టోరి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సుదీప్తో సేన్ ఆసుపత్రిలో చేరారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా విరామం లేకుండా ప్రయాణాలు చేయటం వల్లే ఆయన అనారోగ్యనికి గురైనట్టుగా తెలుస్తోంది. ఇక కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన కేరళ స్టోరీ సినిమా.. ఇప్పటికీ సక్సెస్‌ ఫుల్‌ గా రన్ అవుతూనే ఉంది.

06.The Dairy Of West Bengal
ది కేరళ స్టోరీ, ది కాశ్మీర్ ఫైల్స్ విజయాలతో డైరెక్టర్స్‌ అలాంటి కథల వైపు వెళ్తున్నారు. ఇక ఆ క్రమంలోనే డైరెక్టర్ సనోజ్‌ మిశ్రా… బెంగాల్ రాజకీయాల నేపథ్యంలో ‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే ఇదే వీడియోపై తాజాగా బెంగాల్ ప్రభుత్వ నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు ఈమూవీ మేకర్స్.

07.Bro
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా బ్రో. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మోషన్ పోస్టర్‌లో వచ్చిన శ్లోకానికి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియో రిలీజైంది. అసలు ఈ శ్లోకం అర్థమేంటి.. అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే విషయంపై వీడియోలో క్లారిటీ ఇచ్చారు ఈ మూవీ మేకర్స్.

08.SSMB 28
ద మోస్ట్ అవేటెడ్ మహేష్ మూవీగా త్రివిక్రమ్‌ డైరెక్షన్లో వస్తున్న SSMB28 మూవీ నుంచి తాజాగా మాస్ స్ట్రైక్ అంటూ ఓ ఊరమాసు పోస్టర్ రిలీజైంది. మే31న కృష్ణ జయంతి సందర్భంగా… టైటిల్ అనౌన్స్ జరగనున్న నేపథ్యంలో జెస్ట్ చిన్న టీజ్‌గా రిలీజ్ అయిన ఈ లుక్ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది. కొడితే దిమ్మతిరగాలే అనే కామెంట్ను మరో సారి గుర్తుకు వచ్చేలా చేస్తోంది.

09. Prabhas
సీతా రామం లాంటి క్లాసిక్ తర్వాత వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో ఒక పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టొరీ చేస్తానని అప్పట్లోనే ప్రకటించారు హను రాఘవపూడి. దీనికోసం తమిళ్ హీరో సూర్యతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను తీసుకోవాలనుకున్నారు. కాకపోతే వాళ్లు ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో ఇదే కథను ప్రభాస్‌తో చేయాలని చూస్తున్నారు హను. ఇక సీతారామం టేకింగ్‌కి ఫిదా అయిన ప్రభాస్ ఈ డైరెక్టర్‌ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో త్వరలో ఈ సినిమా మొదలెట్టనున్నారనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ ఇంట జోరుగా వినిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.