TOP 9 ET: బిగ్ అప్డేట్.. పాన్ వరల్డ్ సినిమాలో బన్నీ | కోపంతో ఊగిపోయిన సాయి పల్లవి.
ఎప్పుడూ కూల్‌గా ఉండే సాయి పల్లవికి కోపం తెప్పించారు కొందరు. కొన్ని రోజులుగా ఓ దర్శకుడితో పెళ్లి ఫోటోలంటూ కొన్ని వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. వీటిపై స్పందిస్తూ.. తన సినిమా పూజా కార్యక్రమంలో ఉన్న ఫోటోలను కావాలనే క్రాప్ చేసి విడుదల చేసారంటూ చెప్పుకొచ్చారు. తను రూమర్స్ పట్టించుకోనని.. కానీ కుటుంబం విషయానికి వస్తే స్పందిస్తానని చెప్పారు సాయి పల్లవి.
01.Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై వెళ్లి అట్లీని కలిసారు, ఈ మధ్యే జవాన్ సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నారీయన. తాజాగా బన్నీ, అట్లీ మీటింగ్ ఆసక్తి రేపుతుంది. దాంతో పాటే పాన్ వరల్డ్ సినిమా ఏదో రెడీ అవుతోందనే టాక్ బయటికి వస్తోంది. ఇక బన్నీ ముంబై ఎయిర్ పోర్టులో ఉన్న వీడియోలతో పాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. తన తదుపరి సినిమా చర్చించడానికే అట్లీని కలిసినట్టుగా ప్రచారం జరుగుతుంది.
02.Pushpa
పుష్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ వచ్చేయటంతో మేకింగ్ మీద ఫోకస్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్.
03.Sai Pallavi
ఎప్పుడూ కూల్‌గా ఉండే సాయి పల్లవికి కోపం తెప్పించారు కొందరు. కొన్ని రోజులుగా ఓ దర్శకుడితో పెళ్లి ఫోటోలంటూ కొన్ని వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. వీటిపై స్పందిస్తూ.. తన సినిమా పూజా కార్యక్రమంలో ఉన్న ఫోటోలను కావాలనే క్రాప్ చేసి విడుదల చేసారంటూ చెప్పుకొచ్చారు. తను రూమర్స్ పట్టించుకోనని.. కానీ కుటుంబం విషయానికి వస్తే స్పందిస్తానని చెప్పారు సాయి పల్లవి.
04.Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్ళ సినీ జర్నీని పూర్తి చేసుకున్నారు. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదుతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు చిరు. ముందు పునాది రాళ్లు సినిమా మొదలైనా.. విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదే. ఈయన నాలుగున్నర దశాబ్ధాల ప్రస్థానంపై రామ్ చరణ్ ట్వీట్ చేసారు. తండ్రికి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు.
05.-Rehaman
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూనిట్‌లో కీలక మార్పు జరిగింది. ముందుగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన స్థానంలో దేవీ శ్రీ ప్రసాద్‌ను తీసుకున్నారట మేకర్స్. ప్రజెంట్ తమిళ్‌లో కంగువ, విశాల్ 34 సినిమాలకు సంగీతమందిస్తున్నారు దేవీ శ్రీ.
06.Kumari Sreemathi
నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. ఈ సిరీస్ ట్రైలర్‌ను నాచురల్ స్టార్ నాని విడుదల చేసారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే, కుమారి శ్రీమతి తన జీవితంలో ఒక బలమైన ఆశయం కోసం ప్రయత్నించే ధైర్య సాహసాలు కలిగిన అమ్మాయిగా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించారు.
07.Skanda
బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో వస్తున్న స్కంద సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా రామ్, శ్రీలీల ఇంటర్వ్యూలు మొదలు పెట్టారు. పాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న స్కందపై అంచనాలు బాగానే ఉన్నాయి. అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి.
08.Akasham Dati Vastava
కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆకాశం దాటి వస్తావా. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తుండటంతో ఆసక్తి పెరిగిపోయింది. బలగం తర్వాత ఆ సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. మ్యూజికల్ లవ్ స్టోరీగా వస్తుంది ఆకాశం దాటి వస్తావా సినిమా. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. తాజాగా ఈ సినిమాలోని ఉన్నానో లేనో అనే లిరికల్ సాంగ్ విడుదల చేసారు మేకర్స్.
09.Yathra 2
యాత్ర 2 సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. తొలి భాగంలో నటించిన మమ్ముట్టి సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి, జీవా కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..