AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET: కల్కి ఇష్యూ..రంగంలోకి పోలీసులు | 'నేను కూడా చనిపోయా' కన్నీరు పెట్టిస్తోన్న ట్వీట్‌..

TOP 9 ET: కల్కి ఇష్యూ..రంగంలోకి పోలీసులు | ‘నేను కూడా చనిపోయా’ కన్నీరు పెట్టిస్తోన్న ట్వీట్‌..

Anil kumar poka
|

Updated on: Sep 23, 2023 | 1:11 PM

Share

కెరీర్‌ స్టార్టింగ్‌లో తనకు ఎప్పుడూ నెపోటిజమ్‌ ప్రశ్నలు ఎదురయ్యేవని అన్నారు ఆలియా భట్‌. తాను ఎంత కష్టపడి రాణించినా, అలా ఎందుకు అంటున్నారో అర్థమయ్యేది కాదని చెప్పారు. కానీ, పరిశ్రమలోకి రావడానికి చాలా మంది పడుతున్న కష్టం గమనించిన తర్వాత చాలా విషయాలు తెలిశాయని చెప్పారు ఆలియా.| తాను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఎంతో మంది సహకరించారని, అందరికీ ధన్యవాదాలని చెప్పారు హీరోయిన్‌ కృతి శెట్టి.

01.kalki
ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా కల్కి. ఈ సినిమా లీకుల విషయంలో నిర్మాణ సంస్థ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. కల్కి సినిమాలోని ఫొటోలు, వీడియోలు లీక్‌ చేసిన వారిపై పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు మేకర్స్.

02.Vijay Antony
కూతురి మృతిపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు హీరో విజయ్ ఆంటోని. నా కూతురితో పాటే నేను కూడా చనిపోయానంటూ ట్వీట్ చేశారు. మీరా ఈ ప్రపంచం కంటే ప్రశాంతమైన మరోచోటికి వెళ్లిందని, ఇక మీదట సేవా కార్యక్రమాలన్ని కూతురి పేరుతోనే చేస్తానంటూ ఓ నోట్‌ రిలీజ్‌ చేశారు విజయ్ ఆంటోని.

03.Naa Sami ranga
నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరబాద్‌లో మొదలైంది. తొలి షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్‌ వెంకట్‌ మాస్టర్ ఈ ఫైట్‌ను కంపోజ్ చేస్తున్నారు.

04.leo
విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా లియో. ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. రివెంజ్‌ డ్రామాగా తెరకెక్కుతోంది లియో. త్రిష కథానాయికగా నటించారు. సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. అక్టోబర్‌ 19న విడుదలవుతోంది లియో. పోస్టర్లలో ఇంట్రస్టింగ్‌ కంటెంట్‌ రివీల్‌ చేస్తున్నారు మేకర్స్.

05.the road
త్రిష ప్రధాన పాత్రలో నటించిన సినిమా ది రోడ్‌. రివెంజ్‌ ఇన్‌ 462 కిలోమీటర్స్ అనేది ట్యాగ్‌లైన్‌. అక్టోబర్‌ 6న విడుదల కానుంది ది రోడ్‌. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. తమిళనాడులోని రహదారులపై జరిగే ప్రమాదాలను నేపథ్యంగా చేసుకుని ఈ కథను తెరకెక్కించారు.

06.Trisha
ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఇన్‌డైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు త్రిష. ‘నీ గురించి నీ టీమ్‌ గురించి నీకు తెలుసు, ఇక ఈ రూమర్స్‌ ట్రెండ్ చేయటం ఆపేయండి’ అంటూ ట్వీట్ చేశారు.

07.alia bhat
కెరీర్‌ స్టార్టింగ్‌లో తనకు ఎప్పుడూ నెపోటిజమ్‌ ప్రశ్నలు ఎదురయ్యేవని అన్నారు ఆలియా భట్‌. తాను ఎంత కష్టపడి రాణించినా, అలా ఎందుకు అంటున్నారో అర్థమయ్యేది కాదని చెప్పారు. కానీ, పరిశ్రమలోకి రావడానికి చాలా మంది పడుతున్న కష్టం గమనించిన తర్వాత చాలా విషయాలు తెలిశాయని చెప్పారు ఆలియా.

08.Krithi shetty
తాను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఎంతో మంది సహకరించారని, అందరికీ ధన్యవాదాలని చెప్పారు హీరోయిన్‌ కృతి శెట్టి. సంతోషం, ప్రేమ, బాధ, ద్వేషం, ఇలా ఎన్నో భావోద్వేగాలను దాటాకే సక్సెస్‌ని చూసినట్టు తెలిపారు. ప్రస్తుతం శర్వానంద్‌ సినిమాలో నటిస్తున్నారు కృతి శెట్టి.

09. Tiger
రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ దర్శకుడు. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్‌ను తెలియజేస్తూ డిజైన్ చేసిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యమందించగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..