Navdeep: నార్కోటిక్ పోలీసు విచారణకు హాజరైన నవదీప్
నవదీప్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే నవదీప్‌కు CRPC సెక్షన్ 41A నోటీసు ఇచ్చి.. ఎంక్వైరీ చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.నవదీప్ కూడా పోలీసుల ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసుల ముందుకు వచ్చారు.ఆయన ఎవరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడనే అంశంపై పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. అయితే మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటివరకు మొత్తంగా 11 మందిని అరెస్ట్ చేశారు. అందులో నవదీప్ సన్నిహితుడైన రామ్ చంద్ కూడా ఉన్నాడు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే.. నవదీప్ కూడా డ్రగ్స్ కన్జ్యూమర్ గుర్తించారు..ప్రస్తుతం డ్రగ్స్ సప్లయర్ రామ్‌చందర్‌తో ఉన్న లింకులపై పోలీసులు నవదీప్‌ను ప్రశ్నిస్తున్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ నార్కోటిక్ పోలీసుల ఎదుట హాజరై విచారణకు హాజరయ్యారు.డ్రగ్స్ విక్రేత రామ్‌చందర్‌తో ఆయనకున్న లింకులపై ఆరాతీస్తున్నారు. ఎవరి వద్ద డ్రగ్స్ కొంటున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు.నవదీప్ విచారణ నేపథ్యంలో టాలీవుడ్లో మరెవరి పేర్లు బయటకు వస్తాయనేది హాట్ టాఫిక్‌గా మారింది. నవదీప్ ద్వారా టాలీవుడ్‌కు మాదకద్రవ్యాలు సప్లై అయ్యాయన్నది పోలీసులు అనుమానం. సప్లయర్ రామచందర్ పట్టుబడిన తర్వాత నవదీప్ అజ్ఞాతంలో ఉండిపోయారు. డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు బయటికొచ్చింది..అయితే ఈ కేసుతో సంబంధం లేదని నవదీప్ వెల్లడించారు.ఈ క్రమంలోనే నవదీప్ హైకోర్టు వెళ్లి ముందస్తుగా బయట పడేందుకు యత్నించాడు. అయితే అతని ప్రయత్నాలు వర్కువుట్ అవ్వలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.