TOP 9 ET: దద్దరిల్లే రేంజ్‌లో పుష్ప 2 ప్రీ టిక్కెట్ సేల్స్.. రూ.800 దాటిన టిక్కెట్ ధర.!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప 2 పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి..? విడుదలకు నాలుగు రోజుల ముందే ఓవర్సీస్‌లో రికార్డులు తిరగరాస్తున్నాడు పుష్ప రాజ్. అక్కడ ఇప్పటికే ప్రీ సేల్స్‌తోనే 2 మిలియన్ క్రాస్ చేసింది పుష్ప 2. తెలుగు సినిమాల్లో నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు పుష్ప. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప2 టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.
01.Pushpa 2: దద్దరిల్లే రేంజ్‌లో పుష్ప 2 ప్రీ టిక్కెట్ సేల్స్.!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప 2పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి..? విడుదలకు నాలుగు రోజుల ముందే ఓవర్సీస్‌లో రికార్డులు తిరగరాస్తున్నాడు పుష్ప రాజ్. అక్కడ ఇప్పటికే ప్రీ సేల్స్‌తోనే 2 మిలియన్ క్రాస్ చేసింది పుష్ప 2. తెలుగు సినిమాల్లో నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు పుష్ప.
02.Pushpa: రూ.800 దాటిన టిక్కెట్ ధర..
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప2 టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 నుంచే బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెనిఫిట్ షో టిక్కెట్లకు 800 రూపాయలు అదనంగా చెల్లించాలి. అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా బెనిఫిట్ షోలుంటాయి.
03. Raja Saab: రాజా సాబ్ షూటింగ్ అప్‌డేట్..
ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న రాజా సాబ్ షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఇదే విషయాన్ని హీరోయిన్ మాళవిక మోహనన్ కన్ఫర్మ్ చేసారు. ఒక్కరోజు కూడా వృథా కాకుండా మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని.. త్వరలోనే షూట్ అంతా అయిపోతుందని చెప్పారు మాళవిక. సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.
04. Chiranjeevi: దసరా డైరెక్టర్‌తో.. చిరు సినిమా.?
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. దీని తర్వాత మరో సినిమాకు కమిట్ అవ్వలేదు మెగాస్టార్. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రీకాంత్ ఓదెల ఈ మధ్యే చిరుకు ఓ కథ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రానుంది.
05.lucky bhaskar: 15 దేశాల్లో ట్రెండింగ్ లక్కీ భాస్కర్ రికార్డ్.!
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా లక్కీ భాస్కర్. దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది లక్కీ భాస్కర్. వరల్డ్ వైడ్‌గా 15 దేశాల్లో టాప్ 10 ట్రెండింగ్‌లో చోటు దక్కించుకుంది.
06.vignesh shivan: రాజీపడను..
లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సినిమా కథలో మార్పులు చేయాలని నిర్మాతలు కోరారని చెప్పారు డైరక్టర్ విఘ్నేష్ శివన్. అయితే తాను అందుకు ఒప్పుకోలేదని అన్నారు. సినిమా మొత్తం భవిష్యత్తు నేపథ్యంలో సాగుతుందన్నారు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కథను మార్చమంటే కుదరదని చెప్పానన్నారు విఘ్నేష్.
07. Nayanathara: ఏదో ఒక రోజు వడ్డీతో తిరిగిస్తా..
ఇంతకు ముందుతో పోలిస్తే, ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు నయనతార. లేటెస్ట్ గా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అబద్ధాలతో పక్కవారి జీవితాన్ని నాశనం చేస్తే, దానిని మీరు అప్పుగా భావించాల్సిందే. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి అని అందులో పేర్కొన్నారు.
08. Rehman: డిప్రెషన్‌లో రెహ్మాన్
ఈ రోజుల్లో చాలా మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారన్నారు ఎ.ఆర్.రెహమాన్. జీవితంలో ఏదో కోల్పోయామనే బాధలో ఉంటున్నారని, జీవితమంతా శూన్యంగా మారిందనే భ్రమలో గడుపుతున్నారని చెప్పారు. అయితే దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. చదవడం, రాయడం, ఇష్టమైన సంగీతాన్ని వినడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు.
09.Rahman: పిల్లల కోసం మళ్లీ కలుస్తారా.?
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయం గురించి మాట్లాడిన ఫ్యామిలీ లాయర్ వందన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా పిల్లల కస్టడీకి సంబంధించి నిర్ణయం తీసుకోలేదని, వాళ్లు మళ్లీ కలిసే అవకాశం కూడా లేకపోలేదన్నారు లాయర్ వందన.
10.Ananya Pandey: లైగర్ ఎఫెక్ట్ తండ్రిని దూరం పెట్టిన హీరోయిన్
లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన స్టార్ కిడ్ అనన్య పాండే, ఆ సినిమా గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. లైగర్ రిలీజ్ తరువాత తన సినిమాల ఎంపికలో తండ్రి చంకీ పాండేను జోక్యం చేసుకోవద్దని చెప్పా అన్నారు అనన్య. ప్రస్తుతం డిజిటల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.