Rakesh Master: తన అంతిమ యాత్ర ఎలా ఉండబోతుందో ముందే చెప్పిన రాకేశ్‌ మాస్టర్‌ !!

|

Jun 20, 2023 | 3:01 PM

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. జూన్ 19న బోరబండలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు.

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. జూన్ 19న బోరబండలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు. రాకేశ్ మాస్టర్ గతంలో అనేక యూట్యూబ్ ఛానళ్లకు అనేక ఇంటర్వ్యూ‌లు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ‌లలో చేసిన మాటలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో తన అంతిమయాత్ర ఎలా ఉండాలో, ఎలా సమాధి చేయాలో చూసుకోవాలనిపించి, ముందుగానే వీడియో తీసి చూసుకున్నాను అని చెప్పారు రాకేశ్ మాస్టర్. తన మామగారి సమాధి పక్కన ఓ వేప మొక్క నాటానని.. తాను మరణించిన తరువాత ఆ చెట్టు కిందే తనను సమాధి చేయాలని కోరారు రాకేశ్ మాస్టర్. నా అనుకున్న వాళ్లంతా చనిపోవడంతో జీవితంపై విరక్తి కలిగిందని రాకేశ్‌ మాస్టర్‌ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెగా వారసురాలు వచ్చేసింది.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ

కలియుగ కుంభకర్ణుడు.. స్నానం, తిండి అన్నీ నిద్రలోనే.. ఏడాదిలో 5 రోజులు మాత్రమే మెలకువ

వసూళ్లలో నైజాం మొగుడు.. మనోడే..

సముద్రంలో ఎలుగుబంటి స్విమ్మింగ్‌.. భయంతో పర్యాటకులు పరుగులు

Adipurush: జెస్ట్ 3 రోజుల్లోనే 330కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్

 

Published on: Jun 20, 2023 12:20 PM