సముద్రంలో ఎలుగుబంటి స్విమ్మింగ్.. భయంతో పర్యాటకులు పరుగులు
ఫ్లోరిడా డెస్టిన్‌లోని బీచ్‌లో జనంతో అంతా సందడిగా ఉంది. సందర్శకులు కొందరు సముద్రంలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో వారికి సముద్రంలోంచి ఈదుకుంటూ వస్తున్న ఓ ఎలుగుబంటి కనిపించింది. అది చూసి అంతా భయంతో పక్కకు దూరంగా పరుగు తీశారు.
ఫ్లోరిడా డెస్టిన్‌లోని బీచ్‌లో జనంతో అంతా సందడిగా ఉంది. సందర్శకులు కొందరు సముద్రంలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో వారికి సముద్రంలోంచి ఈదుకుంటూ వస్తున్న ఓ ఎలుగుబంటి కనిపించింది. అది చూసి అంతా భయంతో పక్కకు దూరంగా పరుగు తీశారు. ఇంతలో ఆ ఎలుగుబంటి నాతో ఈదగలిగేవారెవరైనా ఉన్నారా.. అంటూ సవాలు విసురుతున్నట్టుగా ఎంతో చాకచక్యంగా సముద్రాన్ని ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. ఒడ్డుకు రాగానే ఒంటిపై నీటిని దులుపుకొని తన దారిని తాను వెళ్లిపోయింది. ఫ్లోరిడా ఎలుగుబంట్లు, మొసళ్లకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటి సన్నివేశమే. పెన్సకోలా నివాసి జెన్నిఫర్ మేజర్స్ స్మిత్ ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలాంటి దృశ్యాన్ని తాను ఇంతకుముందెన్నడూ చూడలేదని పేర్కొన్నారు. బీచ్‌లో ఉన్నవారంతా ఎలుగుబంటి ఈత కొడుతున్న దృశ్యాన్ని చూసి చాలా ఎంజాయ్ చేశారు. మరోవైపు అది తమమీద ఎక్కడ దాడిచేస్తుందోనని భయపడ్డారు కూడా. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం వేలాదిమందిని ఆకట్టుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: జెస్ట్ 3 రోజుల్లోనే 330కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్
62 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
ఆదిపురుష్ ఎఫెక్ట్.. నేపాల్లో ఇండియన్ సినిమాకు దెబ్బ
రీల్స్ అంటే చచ్చేంత మోజు.. అదే అతని పాలిట శాపమైంది
Adipurush: ఆగని కాంట్రవర్సీ.. అక్కడ ఆదిపురుష్ బ్యాన్ !!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

