Vaarasudu Team Press Meet Live: వారసుడు మూవీ పై ఉన్న అనుమానాలకు చెక్.. క్లారిటీ ఇస్తున్న టీం..(లైవ్)
విజయ్ దళపతి నటిస్తోన్న వారసుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో ఈ మూవీ కోసం దళపతి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం వరిసు. ఈ సినిమాను తెలుగులో వారసుడు టైటిల్ తో తీసుకువస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో ఈ మూవీ కోసం దళపతి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లుగా గత రెండ్రోజులుగా వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. డబ్బింగ్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదని.. దీంతో ఈ సినిమా మరో రెండు మూడు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 14న విడుదల కానుందని ఫిల్మ్ సర్కిల్లో ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై మేకర్స్ స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos