Thalapathy Vijay Politics: తమిళ రాజకీయాల్లో సంచలనంగా విజయ్.. దెబ్బకు కమల్ కూడా తుస్సె.
తమిళనాట మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతోంది. సినీ చరిష్మాతో ఇక్కడ ఇప్పటికే అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి.. కొందరు సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతిగా అభిమానులు ఆరాధించే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. సొంతంగా పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్నారు. తమిళనాట రాజకీయాల్లోకి ఇప్పటిదాకా ఎంతోమంది నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. అందులో సక్సెస్ అయ్యింది మాత్రం చాలా తక్కువ.
తమిళనాట మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతోంది. సినీ చరిష్మాతో ఇక్కడ ఇప్పటికే అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి.. కొందరు సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతిగా అభిమానులు ఆరాధించే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. సొంతంగా పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్నారు. తమిళనాట రాజకీయాల్లోకి ఇప్పటిదాకా ఎంతోమంది నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. అందులో సక్సెస్ అయ్యింది మాత్రం చాలా తక్కువ. అందులోనూ సక్సెస్ అయ్యింది మాత్రం కేవలం ముగ్గురంటే ముగ్గురే. అది కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత.. వారికున్న పొలిటికల్ చరిష్మానే నమ్ముకోకుండా రాజకీయ వ్యూహాలతోనే రాణించగలిగారు.
ఇపుడు మరో నటుడు పొలిటికల్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నారు. అతడే తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్. చాలాకాలంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరుగుతోంది. విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మక్కల్ ఇయక్కమ్ తరపున అభ్యరులను బరిలోకి దింపారు. మొత్తం 169 స్థానాల్లో పోటీ చేస్తే 121 స్థానాల్లో విజయం సాధించారు. కమల్ హసన్ స్థాపించిన మక్కల్ నీదిమయ్యం, సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిలర్ కట్చి ఈ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. దీంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ ట్రెండింగ్‌గా మారిపోయారు. అంతేకాదు ఇదే పేరుతో విజయ్ పార్టీ కూడా స్థాపించబోతున్నారని.. తమిళ రాజకీయాల్లో తన మార్క్ ఏంటో చూపించబోతున్నారనే చర్చ.. అక్కడ జోరుగా జరుగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos