వివాదాస్పద సినిమా రిలీజ్‌ పై.. తుది నిర్ణయం తీసుకున్న హైకోర్టు..

తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం రజాకార్ - ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. బాబీ సింహా, వేదిక లీడ్ రోల్స్‌ లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెల 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే రజాకార్ సినిమా విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

వివాదాస్పద సినిమా రిలీజ్‌ పై.. తుది నిర్ణయం తీసుకున్న హైకోర్టు..

|

Updated on: Mar 15, 2024 | 8:50 AM

తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం రజాకార్ – ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. బాబీ సింహా, వేదిక లీడ్ రోల్స్‌ లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెల 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే రజాకార్ సినిమా విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మూవీ ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్‌ను తాజాగా పక్కకు పెట్టి… రజాకార్‌ మేకర్స్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది తెలంగాణ హై కోర్టు. ఇక విచారణలో భాగంగా… ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ జారీ చేసిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ సినిమాపై అభ్యంతరం ఉంటే నిపుణుల కమిటీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది. సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ ను సవాలు చేయనందున ఎలాంటి ఉత్తర్వ్యులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విడాకుల తర్వాత ఫస్ట్‌ టైం.. తన మాజీ భర్త గురించి కామెంట్స్‌

Premalu: అప్పుడే OTTలోకి వచ్చేస్తున్న ప్రేమలు మూవీ

Follow us