HanuMan Review: హనుమాన్ హిట్టా.? ఫట్టా.? జై హనుమాన్ అంటూ దద్దరిల్లిన థియేటర్స్.

HanuMan Review: హనుమాన్ హిట్టా.? ఫట్టా.? జై హనుమాన్ అంటూ దద్దరిల్లిన థియేటర్స్.

Anil kumar poka

|

Updated on: Jan 13, 2024 | 8:47 AM

తేజ సజ్జా హీరోగా... ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ హనుమాన్. లార్డ్‌ హనుమాన్‌ బేస్డ్ సూపర్ హీరో నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. తాజాగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. అందరి అంచనాలను అందుకునేలా ఉందా లేదా అనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. అంజనాంద్రి అనే ఊర్లో హనుమంతు అలియాస్ తేజా సజ్జా అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయి. చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. అదే ఊళ్లో మాస్టర్ కూతురు మీనాక్షిని అలియాస్ అమృత అయ్యర్ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు.

తేజ సజ్జా హీరోగా… ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ హనుమాన్. లార్డ్‌ హనుమాన్‌ బేస్డ్ సూపర్ హీరో నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. తాజాగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. అందరి అంచనాలను అందుకునేలా ఉందా లేదా అనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ..  అంజనాంద్రి అనే ఊర్లో హనుమంతు అలియాస్ తేజా సజ్జా అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయి. చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. అదే ఊళ్లో మాస్టర్ కూతురు మీనాక్షిని అలియాస్ అమృత అయ్యర్ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. మరోవైపు హనుమంతు అక్క అంజనమ్మ అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ తమ్ముడుతో పాటు అదే ఊర్లో ఉంటుంది. ఆ ఊరిపై పాలెగాళ్లు దౌర్జన్యం చేస్తుంటారు. వాళ్లని ఎదిరించడానికి ఎవరికి ధైర్యం ఉండదు. ఆ సమయంలో బలహీనంగా ఉండే హనుమంతు పాలెగాళ్లను ఎదిరించే క్రమంలో సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో పడిన హనుమంతుకు దివ్యమైన రుధిరమణి లభిస్తుంది. ఆ తర్వాత ఊహించిన విధంగా అద్బుత శక్తి అతడికి లభిస్తుంది. అయితే అతనికి ఉన్నట్టుండి అన్ని శక్తులు ఎలా వచ్చాయని తెలుసుకోవడానికి సూపర్ మాన్ అవ్వాలనుకుంటున్న మైఖేల్ అలియాస్ వినయ్ రాయ్ ఆ గ్రామానికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..

ఒక చిన్న సినిమా చేయడం కాదు.. దాని గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలా చేయడం గొప్ప. ఈ విషయంలో ప్రశాంత్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. కథగా చూసుకుంటే చాలా సింపుల్. ఊళ్లో ఒక మామూలు కుర్రాడికి అనుకోకుండా అతీత శక్తులు వస్తాయి.. ఆ తర్వాత వాడు ఏం చేశాడు అనేది కథ. దీన్ని స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు ప్రశాంత్ వర్మ. తొలి అరగంట కథలోకి వెళ్లడానికి కాస్త టైం తీసుకున్నాడు. కానీ ఒకసారి హీరోకి శక్తులు వచ్చిన తర్వాత ఎక్కడా ఆగలేదు. అక్కడ హీరో ఏం చేస్తున్నా కూడా వెనకాల హనుమాన్ కనిపిస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ లో విలన్లను కొట్టి వాళ్లందరి మీద తేజ కూర్చునే హనుమాన్ రిఫరెన్స్ సీన్ సూపర్. సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు సన్నివేశాలు బాగానే కనెక్ట్ అయ్యాయి. క్లైమాక్స్ 20 నిమిషాలు థియేటర్లలో పూనకాలు ఖాయం. హనుమంతుల వారు దర్శనమిచ్చినప్పుడు థియేటర్ అంతా జై శ్రీరామ్ కేకలతో మారుమోగిపోయింది. హనుమంతుడి శక్తులను ప్రశాంత్ వర్మ చూపించిన తీరు నిజంగానే అభినందనీయం. తేజ సజ్జా తన వరకు పూర్తి న్యాయం చేశాడు. తనకు ఉన్నంతవరకు కథకు సాయం చేశాడు.అమృత అయ్యర్ పర్లేదు.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఓకే. గెటప్ శ్రీను క్యారెక్టర్ బాగుంది. అలాగే వినయ్ రాయ్ కూడావిలన్ గా మెప్పించాడు. దివంగత రాకేష్ మాస్టర్ కామెడీ చాలా బాగుంది. ఆయనకు ఉన్న అద్భుతంగా పేలాయి. హనుమాన్ సినిమాకు నూటికి నూరు మార్కులు వేయాల్సింది టెక్నికల్ టీంకే. మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్ అదిరిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓవరాల్ గా హనుమాన్.. మన సూపర్ మాన్..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos