AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Karam Review: గుంటూరు కారం హిట్టా.? ఫట్టా.? రమణగాడి ఆట ఎలా ఉందంటే.?

Guntur Karam Review: గుంటూరు కారం హిట్టా.? ఫట్టా.? రమణగాడి ఆట ఎలా ఉందంటే.?

Anil kumar poka
|

Updated on: Jan 13, 2024 | 8:40 AM

Share

త్రివిక్రమ్ డైరెక్షన్లో .. మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం! ముచ్చటగా మూడో సారి కలిసి వస్తున్న వీరిద్దరూ... ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. సాంగ్స్‌ అండ్ ట్రైలర్తో.. సినిమా పై మాస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు థియేటర్లోకి వచ్చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది. నిజంగా కుర్చీ మడతెట్టేసేలానే ఉందా..! అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ.

త్రివిక్రమ్ డైరెక్షన్లో .. మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం! ముచ్చటగా మూడో సారి కలిసి వస్తున్న వీరిద్దరూ.. ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. సాంగ్స్‌ అండ్ ట్రైలర్తో.. సినిమా పై మాస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు థియేటర్లోకి వచ్చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది. నిజంగా కుర్చీ మడతెట్టేసేలానే ఉందా..! అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ. వెంకట రమణ అలియాస్ మహేష్ బాబు గుంటూరు మిర్చి యార్డులో ఉంటాడు. పదేళ్ల వయసులోనే అమ్మ అలియాస్ రమ్యకృష్ణ వదిలేసి వెళ్లడంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు. అయితే పాతికేళ్ల తర్వాత తాత అలియాస్ ప్రకాష్ రాజ్ నుంచి రమణకు పిలుపు వస్తుంది. కూతురు రాజకీయ జీవితానికి అడ్డు రాకుండా ఉండాలని రమణతో ఒక సంతకం చేయించాలి అనుకుంటాడు ఆయన తాత. కానీ అమ్మ మీద కోపంతో రమణ ఆ సంతకం చేయడు. ఈ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు లాయర్ పాని అలియాస్ మురళి శర్మ కూతురు ఆముక్త మాల్యద అలియాస్ శ్రీలీల చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా ఉంటే పదేళ్ల వయసులోనే రమణను అమ్మ ఎందుకు వదిలేస్తుంది.. ఆ తర్వాత పాతికేళ్లకు మళ్ళీ ఎందుకు పిలుస్తుంది అనేది అసలు కథ..

ఏ దర్శకుడు సినిమా అయినా యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.. కామెడీ ఎలా ఉందో చూద్దాం అనుకుంటారు.. కానీ త్రివిక్రమ్ సినిమా మాత్రమే మాటల కోసం చూస్తారు. ఆయన పెన్నుకు ఉన్న పవర్ అలాంటిది. అలా మాటలతో మాయ చేయడం గురూజీ స్టైల్. గుంటూరు కారం మొదటి నుంచి ఒకే టెంపోలో వెళుతుంది. ఈ సినిమాను ప్రధానంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ చుట్టూ రాసుకున్నాడు త్రివిక్రమ్. విడిపోయిన తల్లి కొడుకులను కలిపే కథ ఇది. కథాపరంగా చూసుకుంటే చాలా చాలా సింపుల్ కానీ స్క్రీన్ ప్లేతో మాయ చేయాలని చూశాడు త్రివిక్రమ్. అందులో సక్సెస్ అయ్యాడు కూడా.

ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల కంటే ఈ సారి యాక్షన్ సీన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు గురూజీ. దానికి తోడు చాలా రోజుల తర్వాత వన్ లైనర్స్ ఎక్కువగా రాశాడు. అన్నింటికీ మించి గుంటూరు యాస ఉండడంతో పాటు.. మాటల్లో ఎటకారం కూడా ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం మహేష్ బాబు కామెడీతోనే అయిపోతుంది. రెండు మూడు యాక్షన్ సీన్స్, చాలా వరకు అభిమానులు కోరుకునే సన్నివేశాలతోనే నింపేశాడు మాటల మాంత్రికుడు. మహేష్ బాబు నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మరోసారి పూర్తిగా స్క్రీన్ మీద విశ్వరూపం చూపించాడు సూపర్ స్టార్. శ్రీ లీల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మీనాక్షి చౌదరి జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతే. డైలాగ్స్ పెద్దగా ఉండవు. రమ్యకృష్ణ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రం గానే ఉంది. ఇంపార్టెంట్ రోల్ అయినా కూడా ఎందుకు త్రివిక్రమ్ ఆమెను పూర్తిస్థాయిలో వాడుకోలేదు అనిపించింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, జయరాం లాంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక తమన్ సంగీతం బాగుంది. రీ రికార్డింగ్ రిపీట్ మోడ్ లో అనిపించినా.. కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం అదిరిపోయింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే… గుంటూరు కారం.. రమణ గాడు పండక్కి గుర్తుండిపోతాడు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos