Thalapathy Vijay: స్టార్ హీరోకు అభిమాని దిమ్మతిరిగే గిఫ్ట్.! అది దా అభిమానం అంటే..

Thalapathy Vijay: స్టార్ హీరోకు అభిమాని దిమ్మతిరిగే గిఫ్ట్.! అది దా అభిమానం అంటే..

Anil kumar poka

|

Updated on: Apr 24, 2024 | 8:55 AM

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తమిళనాట మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే దళపతి నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజవుతుంటాయి. తమిళ్ కు పోటీగా మంచి కలెక్షన్లు రాబడుతుంటాయి. ఇక తాజాగా ఓ వీరాభిమాని విజయ్ కు అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తమిళనాట మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే దళపతి నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజవుతుంటాయి. తమిళ్ కు పోటీగా మంచి కలెక్షన్లు రాబడుతుంటాయి. ఇక తాజాగా ఓ వీరాభిమాని విజయ్ కు అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. తిరుప్పతూర్ సమీపంలోని జడైయనేర్‌కు చెందిన కదిరవేల్ అనే అభిమాని విజయ్ గురించి ఏకంగా 10 వేల పదాలతో ఒక అద్భుతమైన ఓ కవిత రాశాడు. ఇందుకోసం కదిరవేల్ సుమారు 36 గంటల పాటు కష్టపడ్డాడట. ఇందుకు గానూ అతనికి కేరళ రాష్ట్రానికి యూనివర్సల్‌ అచీవర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ప్యూచర్‌ కలామ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థలు ప్రత్యేక అవార్డులు ప్రధానం చేసి సత్కరించాయి.

ఇంటర్నెట్, సోషల్ మీడియా హవా సాగిస్తోన్న ఈ కాలంలో ఒక హీరో కోసం 36 గంటల పాటు కష్టపడి 10 వేల పదాలతో కవిత రాయడమంటే మామూలు విషయం కాదు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు కదిర్ వేల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ సార్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న దళపతి విజయ్‌ ఈ మధ్యే క్రియాశీల రాజకీయా‍ల్లోకి అడుగుపెట్టాడు. తమిళగ వెట్రి కళగం పేరుతో ఓ పార్టీ కూడా స్థాపించాడు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలో దళపతి విజయ్ పార్టీ బరిలోకి దిగనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘గోట్‌’ మూవీలో నటిస్తున్నాడు దళపతి విజయ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!