తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో చేరన్ ఒకరు. మంగళవారం రోజున తమిళనాడులోని కడలూరు సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్, కండక్టర్ తో వాగ్వాదానికి దిగిన ఘటన కలకలం రేపింది. కారులో కడలూరు మీదుగా పుదుచ్చేరి రాష్ట్రానికి వెళ్తున్నాడు దర్శకుడు చేరన్. పెరియకంకనకుప్పం సమీపంలోకి రాగానే వెనుక వస్తున్న ఓ బస్సు హారన్ కొట్టింది. పెద్ద శబ్దం చేస్తూ వేగంగా బస్సు వేగంగా రావడంతో చేరన్ చాలా టెన్షన్ పడ్డాడు. దీంతో బస్సుకు దారి ఇవ్వడం కుదరలేదు. దీంతో బస్సు డ్రైవర్ హారన్ కొడుతూనే ఉన్నాడు. దాంతో ఒక్కసారిగా అసహనానికి గురైన చేరన్.. మార్గమధ్యలో కారు ఆపి రోడ్డుపైకి వాగ్వాదానికి దిగాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.