Jai Bhim: సూర్య ‘జై భీమ్‌’ వచ్చేస్తోంది.. అమెజాన్‌లో.. వీడియో

Jai Bhim: సూర్య ‘జై భీమ్‌’ వచ్చేస్తోంది.. అమెజాన్‌లో.. వీడియో

Phani CH

|

Updated on: Oct 07, 2021 | 9:46 AM

కథల ఎంపికలో వైవిధ్యం, సహజ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో సూర్య. సూర్య తాజాగా నటిస్తోన్న చిత్రం ‘జై భీమ్‌’. సోషల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీజే జ్ఙానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కథల ఎంపికలో వైవిధ్యం, సహజ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో సూర్య. సూర్య తాజాగా నటిస్తోన్న చిత్రం ‘జై భీమ్‌’. సోషల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీజే జ్ఙానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ.. తర్వాత అమెజాన్‌ వేదికగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అమెజాన్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. దీపావళి కానుకగా ఈ సినిమాను నవంబర్‌ 2న విడుదల చేయనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: బెల్లం, శనగలు కలిపి తింటే ఇన్ని లాభాలా.. అస్సలు వదలరు.. వీడియో

Ravi Teja: జోష్‌ మీదున్న మాస్‌ మహా రాజా.. ఒకేసారి మూడు సినిమాలు.. వీడియో