Superstar Krishna Health: 24 గంటలు గడిస్తేనే గానీ చెప్పలేమన్న డాక్టర్లు.. ఐసీయూలోనే కృష్ణకు చికిత్స (Live Video)
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిన్న కృష్ణ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. గత కొద్దిరోజులుగా కృష్ణ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది.
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిన్న కృష్ణ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. గత కొద్దిరోజులుగా కృష్ణ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఆయన శ్వాససంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణ ను ఐసీయూలో ఉంచి చికిత్య అందిస్తున్నారు వైద్యులు. కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన మొదటి భార్య ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆలాగే ఆయన రెండో భార్య విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక కృష్ణ మిత్రుడు కృష్ణం రాజు కూడా ఇటీవలే కన్నుమూశారు. ప్రస్తుతం కృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కాంటినెంటల్ హాస్పటల్ కు మహేష్ బాబు సహా ఇతర కుటుంబసభ్యులు చేరుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos