Ooru Peru Bhairavakona Review: హిట్టా.? ఫట్టా.? ఊరు పేరు భైరవకోన కోసం సందీప్ కిషన్ కష్టం ఫలించిందా.?

కెరీర్‌లో ఒకట్రెండు విజయాలు తప్ప ఇప్పటి వరకు సరైన బ్లాక్‌బస్టర్ రుచి తెలియని హీరో సందీప్ కిషన్. ఎంతకష్టపడినా ఇప్పటి వరకు ఈయన కోరుకున్న విజయం అయితే రాలేదు. అలాంటి ఈ స్టార్ హీరో... తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ విఐ ఆనంద్‌తో ఊరు పేరు భైరవకోన చేశారు. మరి తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది. లెట్స్‌ సీ దిస్ రివ్యూ.! భైరవకోన కథలోకి వెళితే.. అనగనగా ఓ ఊరు.. ఆ ఊరు పేరు భైరవకోన.

Ooru Peru Bhairavakona Review: హిట్టా.? ఫట్టా.? ఊరు పేరు భైరవకోన కోసం సందీప్ కిషన్ కష్టం ఫలించిందా.?

|

Updated on: Feb 16, 2024 | 8:52 PM

కెరీర్‌లో ఒకట్రెండు విజయాలు తప్ప ఇప్పటి వరకు సరైన బ్లాక్‌బస్టర్ రుచి తెలియని హీరో సందీప్ కిషన్. ఎంతకష్టపడినా ఇప్పటి వరకు ఈయన కోరుకున్న విజయం అయితే రాలేదు. అలాంటి ఈ స్టార్ హీరో.. తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ విఐ ఆనంద్‌తో ఊరు పేరు భైరవకోన చేశారు. మరి తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది. లెట్స్‌ సీ దిస్ రివ్యూ.! భైరవకోన కథలోకి వెళితే.. అనగనగా ఓ ఊరు.. ఆ ఊరు పేరు భైరవకోన. అందులోకి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో బయటికి రావడం అనేది జరగదు. అయితే ఓ దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బసవలింగం అలియాస్ సందీప్ కిషన్, జాన్ అలియాస్ వైవా హర్ష అనుకోకుండా ఆ ఊళ్లోకి వెళ్తారు. వాళ్లతో పాటు అగ్రహారం గీత అలియాస్ కావ్య థాపర్ కూడా ఆ ఊరిలోకి వెళ్తుంది. అలా అనుకోకుండా ఆ ఊరిలోకి వెళ్లిన వీరందరూ అక్కడి నంచి సేఫ్‌గా బయటపడతారా? బసవ అండ్ టీంకు అక్కడ ఎదురైన కష్టాలేంటి..? వాళ్లు ఎలా బయటపడగలిగారు. అందుకోసం ఏం చేశారన్నదే సినిమా..! ఊరు పేరు భైరవకోన సినిమా… ఐడియా అదిరిపోయింది. ఫస్టాఫ్ వరకు స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్. అక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది.

ఫస్ట్ సీన్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు డైలాగ్‌ ఆనంద్. ఎలాగూ ఫాంటసీ అన్నాడు కాబట్టి లాజిక్స్‌కు అందని సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నాడు.. ఇక హీరో అండ్ గ్యాంగ్ భైరవకోనలోకి ఎంట్రీ ఇచ్చే సీన్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా అలరిస్తాయి. అయితే సినిమా చూస్తుంటే అక్కడక్కడా తన ప్రీవియస్ ఫిల్మ్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫ్లేవర్ కొడుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ రేంజ్‌లో ఇచ్చాక.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెరుగుతుంది. కానీ కీలకమైన సెకండాఫ్‌లోనే ఎమోషన్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. దెయ్యాలతో కామెడీ చేయించడం.. అక్కడ వచ్చే కొన్ని సీన్స్ వర్కవుట్ కాలేదని అనిపిస్తుంది. కానీ భైరవకోనకు సంబంధించిన ట్విస్ట్ బయటపడే సీన్ బాగుంది. ఇక యాక్టింగ్‌ విషయాన్ని వస్తే.. సందీప్ కిషన్ సూపర్భ్‌గా యాక్ట్ చేశాడు. హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ కూడా తమ కారెక్టర్స్‌కు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇక సీనియర్ యాక్టర్ వడి వక్కరసి ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ కూడా యాప్ట్‌గా అదిరిపోయేలా కొట్టాడు. రిమైనింగ్ క్రాఫ్ట్స్‌ కూడా వారి వారి పనిని బానే చేశాయి. ఇక ఫైనల్‌గా ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే.. థ్రిల్‌ కోసం చూడాల్సిన సినిమా.!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us