Sukumar samantha special song: నేను అలా చెప్పడం వల్లే  సమంత స్పెషల్ సాంగ్ కి  ఒప్పుకుంది..! సుకుమార్‌ కామెంట్స్‌.. (వీడియో)

Sukumar samantha special song: నేను అలా చెప్పడం వల్లే సమంత స్పెషల్ సాంగ్ కి ఒప్పుకుంది..! సుకుమార్‌ కామెంట్స్‌.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 02, 2022 | 9:11 AM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ అందుకుంది.


స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇందులో బన్నీ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ మూవీ విడుదల కంటే ముందే ఇందులోని సాంగ్స్ రికార్డ్స్ సృష్టించాయి. ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాట యూట్యూబ్‏లో సంచలనం సృష్టించింది.హీరోయిన్ సమంత తొలిసారి స్పెషల్ సాంగ్ చేయడం.. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్ నెట్టింట్లో మిలియన్ వ్యూస్‏తో షేక్ చేస్తుంది. ఇక థియేటర్లలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా డైరెక్టర్ సుకుమార్.. సమంత స్పెషల్ సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ పాట గురించి సమంతకు చెప్పగానే తనకు కరెక్ట్ కాదని ఆమె చెప్పారని, . అయితే నటిగా ఇది తనకు కొత్తగా ఉంటుందని.. ఈ సాంగ్ ఆమెకు బాగా యాప్ట్ అవుతుందని చెప్పి తానే సమంతను ఒప్పించినట్లు చెప్పారు సుకుమార్. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్రస్తావన తీసుకొచ్చినా కూడా సమంత ఒప్పుకోలేదని.. ఆ తర్వాత తన మాటపై నమ్మకంతో ఓకే చెప్పి ఈ సాంగ్ చేసారిని సుకుమార్ చెప్పారు.