Sukumar: ఈసారి నేషనల్ అవార్డ్‌ చరణ్‌కే.. తేల్చేసిన సుకుమార్‌

|

Dec 24, 2024 | 12:36 PM

ట్రిపుల్ ఆర్ హంగామా ముగిసింది మొదలు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్సందరూ గేమ్ ఛేంజర్ సినిమా వైపే చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌ ఎప్పుడంటూ..వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ వెయింటింగ్‌కు ఇటీవలే తెరదింపిన ఈ మూవీ మేకర్స్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీపై మరింత బజ్‌ పెంచే పనిని ముందేసుకున్నారు. మూవీని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్‌ డల్లాస్ లో జరిగింది. ఇక ఈ ఈవెంట్లోనే చరణ్‌ యాక్టింగ్ గురించి సుకుమార్ చేసిన ఓ కామెంట్‌ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిరంజీవి ఎందుకు శంకర్ గారితో సినిమా చేయలేదని.. శంకర్ ఎందుకు తెలుగు సినిమా చేయడం లేదని.. అప్పట్లో తామందరం అనుకునే వాళ్లమని చెప్పాడు సుక్కు. కానీ ఇటీవల శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడని తెలిసి తెగ ఆనందపడ్డానంటూ చెప్పారు. అంతేకాదు ఈ విషయం రామ్ చరణ్ మొదట తనకే చెప్పాడంటూ.. మురిసిపోయారు సుక్కు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు…

హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం

20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??

తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..

ప్రైమ్‌ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్‌.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి

Published on: Dec 24, 2024 12:35 PM