Rajamouli: ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న.. మరీ ఇంత అడ్వాన్స్ గానా
రాజమౌళి తన సినిమా ప్రమోషన్స్ విధానాన్ని పూర్తిగా మార్చేశారు. రిలీజ్‌కి ఏడాదిన్నర ముందే గ్లోబల్ ఈవెంట్‌లతో సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. ప్రియాంక చోప్రా స్పీచ్, స్టార్ల సెల్ఫీలు వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ మీడియా ఈ ఉత్సాహాన్ని గమనిస్తోంది. భారీ స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది, తదుపరి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజమౌళి మారిపోయారని మొన్నటికి మొన్నే కదా మాట్లాడుకున్నాం. దాన్ని అక్షరాలా నిజం చేసి చూపిస్తోంది ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్రతి చిన్న విషయాన్నీ దాచి పెట్టి, సినిమా రిలీజ్‌కి ముందు పక్కాగా రివీల్ చేసే జక్కన్న రిలీజ్‌కి ఏడాదిన్నరదాకా ఉండగానే ప్రమోషన్లు స్టార్ట్ చేసేశారు. వారణాసి సినిమా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ గురించి, వారణాసి మూవీ టైటిల్ గ్లింప్స్ గురించీ ఇంకా జనాలు మర్చిపోనే లేదు. అదిగో మొదలవుతుంది.. ఇదిగో మొదలవుతుంది అంటూ జనాలను ఊరించిన జక్కన్న.. ఇప్పుడు ఈవెంట్ అయిపోయాక కూడా ఆ మేనియా నుంచి బయటపడనివ్వడం లేదు. ఆయనే కాదు.. టోటల్ టీమ్ ఇప్పుడు అదే పనిలో ఉంది. తగలపెట్టేద్దామా అంటూ ప్రియాంక చోప్రా చేసిన స్పీచ్ ప్రాక్టీస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతే కాదు, ముగ్గురు స్టార్స్ కలిపి తీసుకున్న సెల్ఫీలు కూడా వైరల్ అవుతున్నాయి. రిలీజ్‌కి ఏడాదికి పైగానే ఉంది.. అయినా ఇప్పుడే మేం ప్రమోషన్లు స్టార్ట్ చేశాం. ఇంటర్నేషనల్ మీడియా చూపిస్తున్న ఉత్సాహం ఆనందం కలిగిస్తోందంటూ మనసులోని మాటలు బయటపెట్టేశారు సిల్వర్ స్క్రీన్ మందాకిని. తెలుగు, మలయాళ సూపర్‌స్టార్లతో కలిసి చేస్తున్న మూవీ గురించి మరింత ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు దేశీ గర్ల్. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న స్కేల్, వీఎఫ్‌ఎక్స్ ని బిల్డ్ చేస్తున్న విధానం… ఇలా ప్రతిదీ టాక్ ఆఫ్ ది గ్లోబ్ అవుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ చిత్రీకరిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ప్లాన్ చేస్తారోననే క్యూరియాసిటీ కూడా జనాల్లో అదే రేంజ్‌లో ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిల్వర్ స్క్రీన్ మీద రిపీట్ అవుతున్న జోడీలు.. మళ్లీ కుదురుతున్నట్టేనా ??
Nayanthara: సింహా జోడీకి సూపర్‌క్రేజ్.. మహారాణి వచ్చేస్తున్నారహో
పాన్ ఇండియా డైరెక్టర్లు.. పక్కా లోకల్ సినిమాలు చేసేదెప్పుడు
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

