Sreeleela: శ్రీలీల ప్లాన్ నెక్స్ట్ లెవెల్.. వర్కవుట్ అయితే వాళ్ల సీటు గల్లంతే

Edited By: Phani CH

Updated on: Dec 15, 2025 | 3:32 PM

సినిమాలు చేసినా, చేయకపోయినా శ్రీలీల పేరు ట్రెండింగ్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో మోస్ట్ వాంటెడ్‌గా మారారు. కార్తీక్ ఆర్యన్, ఇబ్రహీం అలీ ఖాన్, పవన్ కళ్యాణ్‌లతో సహా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ముంబైలో స్థిరపడే ఆలోచనలో ఉన్న ఆమె, విజయాల కోసం ఎదురుచూస్తూనే, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా నిలిచారు.

సినిమాలు చేసినా చేయకపోయినా శ్రీలీల పేరు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. మరోసారి ఇదే జరిగింది. అమ్మడి తీరు చూస్తుంటే ముంబైలోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తుంది. అక్కడ్నుంచి సినిమాలే కాదు కమర్షియల్ యాడ్స్ కూడా వస్తున్నాయి. పైగా స్టార్స్ నుంచి పిలుపు అందుతుంది. దాంతో శ్రీలీల కెరీర్‌కు మరోసారి బూస్టప్ కనిపిస్తుంది. పైకి ఖాళీగా ఉన్నట్లే కనిపిస్తున్నా నిజానికి చాలా బిజీగా ఉన్నారు శ్రీలీల. ఓవైపు టాలీవుడ్.. మరోవైపు బాలీవుడ్.. ఇంకోవైపు కోలీవుడ్.. అన్ని ఉడ్లలో మోస్ట్ వాంటెడ్ అయిపోతున్నారు శ్రీలీల. ముఖ్యంగా ముంబై నుంచి అమ్మడికి అదిరిపోయే అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ కార్తిక్ ఆర్యన్‌తో నటిస్తున్నారు.. 2026 ఫస్టాఫ్‌లో విడుదల కానుంది ఈ చిత్రం. కార్తిక్ సినిమా సెట్స్‌పై ఉండగానే.. మరో రెండు మూడు ఆఫర్స్ శ్రీలీల ఖాతాలో చేరిపోయాయి. హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మ్యాడాక్‌లో ఓ సినిమాకు సైన్ చేసారు ఈ బ్యూటీ. దాంతోపాటు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహాం అలీ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న దిలేర్‌లోనూ శ్రీలీలే హీరోయిన్. అలాగే ఛూమంతర్ అనే మరో సినిమాలోనూ నటిస్తున్నారు. తెలుగులో పవన్‌తో ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తున్నారు. ఇక తమిళంలో పొంగల్‌కు పరాశక్తితో పొంగల్‌కు రాబోతున్నారు శ్రీలీల. వరస సినిమాలు చేస్తున్నా విజయం మాత్రం రావట్లేదు శ్రీలీలకు. పుష్ప 2లో కిసిక్ పాట తర్వాత ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఈ బ్యూటీ. మరి ఇందులో ఆమె కోరుకున్న విజయం ఏ ఇండస్ట్రీ నుంచి వస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు

సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు

హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే

పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు

అబ్బా జస్ట్ మిస్.. లేదంటే అఖండలో మనోజ్‌ కూడా రెచ్చిపోయేటోడు