ఆన్‌లైన్‌లో హీట్ పెంచుతున్న బ్యూటీస్‌

Edited By: Phani CH

Updated on: Oct 31, 2025 | 3:47 PM

స్టార్ హీరోయిన్ అయినా, యంగ్ హీరోయిన్‌ అయినా, సక్సెస్‌లలో ఉన్నా... ఫెయిల్యూర్స్‌లో ఉన్నా... సినిమాల్లో బిజీగా ఉన్నా... ఆఫర్సే లేకపోయినా... అందాల భామల సోషల్ మీడియా యాక్టివిటీ మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఆడియన్స్‌ అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు స్టార్ హీరోయిన్స్‌ నుంచి యంగ్ బ్యూటీస్ వరకు ప్రతీ ఒక్కరు ఇలాంటి ప్రయోగాలు చూస్తూనే ఉన్నారు.

ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ రష్మిక మందన్న. కమర్సియల్ మూవీతో పాటు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్‌లోనూ నటిస్తూ నెంబర్‌ రేసులో దూసుకుపోతున్నారు. ఇంత బిజీలోనూ సోషల్ మీడియాకు టైమ్ ఇస్తున్నారు ఈ భామ. సినిమా అప్డేట్స్‌తో మాత్రమే కాదు, గ్లామరస్‌ ఫోటోషూట్స్‌తోనూ ఫ్యాన్స్‌ను ఎంగేజ్ చేస్తున్నారు. తాజాగా లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నేషనల్ క్రష్, గ్లామరస్‌ లుక్‌లో అదరగొట్టారు. బ్లాక్ అండ్‌ వైట్‌ వెస్ట్రన్‌ అవుట్‌ఫిట్‌లో వావ్ అనిపించారు. ఆన్‌ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్‌ స్క్రీన్‌ కూడా గ్లామర్ విషయంలో తగ్గేదే లే అన్న సిగ్నల్‌ ఇస్తున్నారు రష్మిక. వెండితెర మీద అంతగా బిజీగా లేని రకుల్ కూడా సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ప్రజెంట్ ఒక్క బాలీవుడ్ మూవీ మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ, గ్లామరస్‌ ఫోటోస్‌తో ఆ మూవీ సాంగ్ ఎలా ఉందంటూ నెటిజెన్స్‌ను టీజ్ చేశారు. యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా అయితే ఆన్‌లైన్‌లో హీట్ పెంచేస్తున్నారు. ఈ మధ్య రెగ్యులర్‌గా ఫోటో షూట్స్ చేస్తున్న ఈ భామ, ఇప్పుడు టెంపరేచర్‌ మరింత రెయిజ్ చేశారు. ఈ భామ బికినీ ఫోటోషూట్‌ పిక్స్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. సినిమా యాక్టివిటీ ఉన్నా లేకున్నా.. అందాల భామల ఆన్‌లైన్ యాక్టివిటీ మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్‌ రివ్యూ ఇచ్చిన గౌతమ్‌

Toxic: టాక్సిక్‌ వాయిదా న్యూస్‌పై నిర్మాతలేమంటున్నారు ??

రైలు టాయిలెట్‌లో అనుకోని అతిథి.. ప్రయాణికులు షాక్‌

మారనున్న EPFO రూల్స్‌..కోటి మందికి ప్రయోజనం

దూసుకెళ్తున్న యూపీఐ.. రూ.143 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు

Published on: Oct 31, 2025 03:44 PM