Sonu sood tweet: ఐటీ దాడులపై సోనూసూద్ భావోద్వేగ ట్వీట్..! వైరల్ అవుతున్న వీడియో..
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆయన 20 కోట్ల రూపాయల వరకు పన్ను ఎగ్గొట్టినట్లు తెలిపింది. కరోనా కాలంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించారని ఐటీ అధికారులు తేల్చిచెప్పారు.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆయన 20 కోట్ల రూపాయల వరకు పన్ను ఎగ్గొట్టినట్లు తెలిపింది. కరోనా కాలంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించారని ఐటీ అధికారులు తేల్చిచెప్పారు. దాదాపు 4 రోజుల పాటు ఐటీ అధికారులు సోనూసూద్‌ను ప్రశ్నించారు.
అయితే ఐటీ దాడుల తర్వాత తాజాగా సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఎమెషనల్ పోస్టు పెట్టారు….‘ప్రతి భారతీయుని ప్రార్థనల ప్రభావం గొప్పవి… ఎంతలా అంటే దెబ్బతిన్న రోడ్లలో కూడా ప్రయాణం చాలా సులువవుతుంది’ అని రాసుకొచ్చారు. అలాగే ‘ నీలోని నిజాయితీని నువ్వు చెప్పుకోనక్కరలేదు. కాలమే బయటపెడుతుంది. ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. అదే నాకు బలాన్నిస్తుంది. నా ఫౌండేషన్ తరపున ఖర్చుచేస్తున్న ప్రతీ రూపాయీ ఒక విలువైన జీవితాన్ని కాపాడటంతో పాటు అర్హులకు చేరుతుంది. ఇదేవిధంగా నేను మద్దతు పలుకుతున్న బ్రాండ్‌ల నుంచి వస్తున్న ఆదాయాన్ని అవసరాల్లో ఉన్న వారికి అందిస్తుంటాను. ఇది నిర్విరామంగా కొనసాగుతుంటుంది. నా జర్నీ ఇలాగే కొనసాగుతుంటుంది… జై హింద్… సోనూసూద్’ అని రాశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : 5 doses vaccine Video: ‘5 డోసులు ఇచ్చాం.. ఆరో డోసుకు ఆ రోజు రండి..!’ సర్టిఫికెట్ చూసి షాకైన వ్యక్తి..(వీడియో)
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

