Viral Video: ప్రాణాలకు తెగించి దొంగతో పోరాడిన మహిళ… కట్‌చేస్తే ఉద్యోగం ఊస్ట్.. అసలేం జరిగిందంటే..(వీడియో)
మనిషి జీవితలో ఏరోజు.. ఏ క్షణం ఏం జరుగుతుంతో తెలీదు. ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లింది మొదలు తిరిగి ఇంటికి చేరేలోపు అనుకోని సంఘటనలు ఎన్నో ఎదురవుతాయి. అలాంటిదే ఈ వీడియో. రెస్టారెంట్‌లో పనిచేసుకుంటున్న ఓ మహిళా ఉద్యోగిపై అకస్మాత్తుగా ఓ దొంగ దాడికి పాల్పడ్డాడు...
మనిషి జీవితలో ఏరోజు.. ఏ క్షణం ఏం జరుగుతుంతో తెలీదు. ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లింది మొదలు తిరిగి ఇంటికి చేరేలోపు అనుకోని సంఘటనలు ఎన్నో ఎదురవుతాయి. అలాంటిదే ఈ వీడియో. రెస్టారెంట్‌లో పనిచేసుకుంటున్న ఓ మహిళా ఉద్యోగిపై అకస్మాత్తుగా ఓ దొంగ దాడికి పాల్పడ్డాడు. ఊహించని సంఘటనకి షాక్ తిన్న మహిళ వెంటనే తేరుకొని అతనిపై ప్రతి దాడికి దిగింది. భయపడి పారిపోకుండా దొంగతో సాయశక్తులా ఫైట్ చేసింది. చివరికి ఆ దొంగని తరిమికొట్టింది. ఇంత చేసిన ఆ మహిళకు ఊహించని మరో షాక్ తగిలింది.
అమెరికాలోని ఇల్లినాయిస్లో స్థానికంగా ఉన్న సబ్‌వే రెస్టారెంట్‌లో అరసెలీ సోటెలో అనే మహిళ ఉద్యోగం చేస్తుంది. ఆమె విధులు నిర్వహిస్తుండగా ఆ రెస్టారెంట్లోకి ఓ దొంగ వచ్చాడు. తుపాకీ చూపిస్తూ.. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇవ్వమని బెదిరించాడు. దీంతో ఆ మహిళ దొంగకు ఎదురు తిరిగి, అతనితో ఫైట్‌చేసింది. దీంతో అతని చేతిలో ఉన్న రివాల్వర్ కిందపడిపోవడంతో.. వెంటనే ఆమె ఆ తుపాకీ పట్టుకుని అతడిని బెదరగొట్టింది. ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగిన ఫైట్‌లో చివరకు దొంగ తోకముడిచాడు. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది ఈ వీడియో చూసిన సదరు రెస్టారెంట్ ఓనర్స్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేశారు. ఎందుకంటే… ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేయడంవల్ల. అయితే అది షేర్ చేసింది తను కాదని.. సదరు మహిళ ఎంత చెప్పినా వినిపించుకోలేదు రెస్టారెంట్ నిర్వాహకులు. తనకు జరిగిన అన్యాయాన్ని నెటిజన్లతో పంచుకుంది ఆ మహిళ… మహిళ ధైర్యానికి మెచ్చుకుంటూనే నెజిటన్లు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Love Story Easwari Rao: ‘లవ్ స్టోరీ’ ఫేమ్ ఈశ్వరీరావుతో స్పెషల్ చిట్ చాట్.. ఆసక్తికరమైన విషయాలు..(వీడియో)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్‌లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

