5 doses vaccine Video: ‘5 డోసులు ఇచ్చాం.. ఆరో డోసుకు ఆ రోజు రండి..!’ సర్టిఫికెట్ చూసి షాకైన వ్యక్తి..(వీడియో)
కరోనా రెండు డోసులు తీసుకున్న ఓ వ్యక్తి తన టీకా సర్టిఫికెట్ చూసుకుని షాక్ తిన్నాడు. సర్టిఫికేట్‌లో ఆయన టీకా 5 డోసులు తీసుకుని, ఆరో డోసుకు షెడ్యూల్ చేసుకున్నట్లుగా ఉంది. దీంతో కంగుతిన్న ఆయన.. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది.
మీరట్‌లోని సర్ధానా ప్రాంతానికి చెందిన రామ్‌పాల్ సింగ్.. భారతీయ జనతాపార్టీ బూత్ స్థాయి నాయకుడు. మార్చి 16న తొలి డోసు, మే 8న రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇటీవల టీకా సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోగా దాన్ని చూసి రామ్‌పాల్ ఆశ్చర్యపోయాడు. అందులో ఆయన ఐదు డోసులు తీసుకుని, ఆరు డోసుకు షెడ్యూల్ చేసుకున్నట్లుగా ఉంది. మార్చి 16న తొలి, మే 8న రెండో డోసు, మే 15న మూడో డోసు, సెప్టెంబరు 15న నాలుగో, ఐదు డోసులు ఇచ్చినట్లుగా ఉంది. డిసెంబరు 2021 నుంచి జనవరి 2022 మధ్య ఆరో డోసుకు షెడ్యూల్ కన్పిస్తోంది.
దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. టీకా పంపిణీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన సర్టిఫికేట్‌లో డోసుల వివరాలు తప్పుగా వచ్చాయని ఆరోపించారు. దీనిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పందిస్తూ వెబ్‌సైట్ హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: ప్రాణాలకు తెగించి దొంగతో పోరాడిన మహిళ… కట్‌చేస్తే ఉద్యోగం ఊస్ట్.. అసలేం జరిగిందంటే..(వీడియో)