sonakshi-zaheer: సోనాక్షిసిన్హా, జహీర్ ఇక్బాల్.. తమ రిలేషన్‌ను అఫిషీయల్ చేసిన లవ్‌బర్డ్స్..
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, నోట్‌బుక్ సినిమా హీరో జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది . ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, విందులు, వినోదాలకు హజరవ్వడం.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, నోట్‌బుక్ సినిమా హీరో జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది . ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, విందులు, వినోదాలకు హజరవ్వడం. అంతేకాదు ఇద్దరు క్లోజ్‌గా దిగిన ఫొటోలను కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ ఫిక్సయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల సోనాక్షి బర్త్‌డే సందర్భంగా తమ సీక్రెట్ రిలేషన్‌ను అఫిషీయల్ చేసింది ఈ జంట.ఈ సందర్భంగా సోనాక్షితో కలిసి విమానంలో పయనిస్తున్న ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసిన ఇక్బాల్ ఆమెకు ఇన్‌స్టా ద్వారా లవ్యూ చెప్పాడు. ఇది చూసిన వీరి ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్బాల్ పోస్ట్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పదించారు. కాగా ఇటీవల సోనాక్షి చేతికి డైమండ్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ తన డ్రీమ్ నిజమైందంటూ క్యాప్షన్ ఇచ్చింది.ఐ దబాంగ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షికి పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె ఏడాదికి ఒక సినిమా చేస్తూ వస్తోంది. ఇక జహీర్ ఇక్బాల్ 2019లో నోట్‌బుక్ మూవీతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ వెంటనే డబుల్ ఎక్సెల్ మూవీ చేశాడు. ఇందులో సోనాక్షితో జతకట్టాడు. ఈ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని తెలిసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..