Model Murder case: ఫ్రిజ్‌లో కాళ్లు.. కుండలో తల.. ఆస్తి కోసం ఇంత కిరాతకమా..?
ప్రముఖ హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ హత్యోదంతం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెలుగు చూస్తున్న వాస్తవాలను చూసి షాక్ అయ్యారు. ఛిద్రమైన ఆమె శరీర భాగాలను నగర శివార్లలోని
ప్రముఖ హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ హత్యోదంతం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెలుగు చూస్తున్న వాస్తవాలను చూసి షాక్ అయ్యారు. ఛిద్రమైన ఆమె శరీర భాగాలను నగర శివార్లలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో గుర్తించారు. తల, మొండెం కోసం గాలిస్తుండగా.. ఘటన జరిగిన ఇంట్లోని సూప్ కుండల్లో ఆమె శరీర భాగాలను చూసి కంగుతిన్నారు. 28 ఏళ్ల హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. అణువణువు గాలించారు. చివరికి రెండు రోజుల తర్వాత తైపో జిల్లాలోని ఓ ఇంట్లో ఆమె శరీర భాగాలను గుర్తించారు. మిగిలిన వాటి కోసం డాగ్ స్క్వాడ్, డ్రోన్ల సాయంతో డ్రైనేజీల్లోనూ గాలించారు. చివరికి ఘటన జరిగిన ఇంట్లోని ఫ్రిజ్‌లో ఆమె కాళ్లు కనిపించాయి. తల, మొండెం, చేతులు.. అందంగా అలకరించిన రెండు సూప్ కుండల్లో కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.. ఈ హత్య పక్కా ఫ్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. చోయ్ శరీర భాగాలు కనుగొన్న ఇంట్లో ఎలక్ట్రిక్ రంపం, మాంసం స్లైసర్, దుస్తులు, మోడల్ ఐడీకార్డులతో సహా ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. మోడల్ అబ్బి చోయ్ ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతోనే ఆమె మాజీ భర్త ఈ హత్యకు కుట్రపన్నినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో చోయ్ మాజీ భర్త అలెక్స్ క్వాంగ్‌తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా వీరికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!